GOVT JOBS 2022 ALERT FOR UNEMPLOYED ONLY FEW DAYS HAVE CHANCE TO APPLY THESE JOBS EVK
Govt jobs 2022: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. ఈ జాబ్స్ అప్లై చేశారా.. కొద్ది రోజులే చాన్స్!
ప్రతీకాత్మక చిత్రం
Govt Jobs 2022 | ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. ఈ వారం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు చివరి తేది. మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వారం పదిరోజులు చాన్స్ ఉంది. వాటి వివరాలు..
ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications) లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిపరేషన్ఫై దృష్టిపెట్టవచ్చు. ఈ వారం, వచ్చే వారం దరఖాస్తు చేయాల్సిన పలు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల అర్హతలను గమనించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రీజియల్లో ఈఎస్ఐసీ ఉద్యోగాలు, తెలంగాణ రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో జాబ్స్, సీపీఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీరు ఈ వారం రోజుల్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది.
భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగుళూరు (Bangalore) లోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (Central Power Research Institute) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల ఎంపికకు ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా వేతనం రూ.20,000 నుంచి రూ.30,000 వరకు అందిస్తారు. నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://cpri.res.in/career ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 31, 2022 వరకు అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
డీఎస్ఎస్ఎస్బీలో 691 ఉద్యోగాలు..
నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (National Capital Territory of Delhi) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ (Delhi) సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు ( Delhi Subordinate Services Selection Board)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ విభాగంలో 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 10, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ (Notification)లో పేర్కొన్నారు. అప్లికేషన్ ప్రాసెస్, పోస్టుల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ dsssb.delhi.gov.in ను సందర్శించాలి. పోస్టుల దరఖాస్తుకు ఫిబ్రవరి 9, 2022 వరకు అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఈఎస్ఐసీలో..
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation) లో పలు రీజియన్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రీజియన్‌కు సంబంధించి అప్రర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టనోగ్రఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయసు 27 సంవత్సరాలుగా నోటిఫికేషన్లో తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తులు జనవరి 15, 2022న ప్రారంభమై ఫిబ్రవరి 15, 2022న ముగుస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.56,000 వరకు వేతనం అందిస్తారు. నోటఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ https://www.esic.nic.in/recruitments ను సందర్శించాల్సి ఉంటుంది. (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.