ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసే అభ్యర్థులు.. జాబ్ అప్లికేషన్ (Job Applications)లను త్వరగా పూర్తి చేయాలి. ఎందుకుంటే చివరి నిమిషంలో సర్వర్ సమస్యల వల్ల దరఖాస్తు కష్టం అవ్వొచ్చు. కావున వారం పది రోజుల ముందే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తి చేస్తే మంచింది. దీని ద్వారా ప్రిపరేషన్ఫై దృష్టిపెట్టవచ్చు. కాబట్టి ఈ వారం, పదిహేను రోజుల్లో దరఖాస్తు చేయాల్సిన పలు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల అర్హతలను గమనించుకొని త్వరగా దరఖాస్తు చేసుకోండి. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటి అప్లికేషన్ విధానం..
ఇంటర్ అర్హతతో 400 పోస్టులు..
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) అండ్ నావల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ కోసం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 400 పోస్టుల్ని ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 జూన్ 7 లోగా దరఖాస్తు చేయాలి. ఇంటర్మీడియట్ పాసైనవారు అప్లై చేయొచ్చు. 2022 సెప్టెంబర్ 4న ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో శిక్షణ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
డిగ్రీ అర్హతతో 339 పోస్టులు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ కోసం జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. మొత్తం 339 పోస్టుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పలు ఖాళీలున్నాయి. ఈ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జూన్ 7 లోగా దరఖాస్తు చేయాలి. డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు. 2022 సెప్టెంబర్ 4న ఎగ్జామ్ ఉంటుంది. ఎంపికైనవారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్కుసంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
ఇండియన్ బ్యాంక్‌లో 312 ఎస్ఓ జాబ్స్..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి 312 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://www.indianbank.in/career/ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు లింక్ మే 24, 2022 నుంచి జూన్ 14, 2022 వరకు తెరిచి ఉంటుంది. (మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి)
* JSSC రిక్రూట్మెంట్ - 2022
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) వివిధ విభాగాల్లో 991 క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 964 ఖాళీలు క్లర్క్‌లు కాగా, 27 స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు JSSC అధికారిక పోర్టల్jssc.nic.in ద్వారా ఆన్లైన్లో జూన్ 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.