Home /News /jobs /

GOVT JOBS 2022 1625 JOBS IN ECIL SALARY RS 24780 KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Govt Jobs 2022: ఈసీఐఎల్‌లో 1,625 ఉద్యోగాలు.. వేత‌నం రూ.24,780.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

ECIL Recruitment 2022 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తారు

ఇంకా చదవండి ...
    ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తారు. ఈ పోస్టుల‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడ‌ద‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల ఆధారంగా రూ. 20,480 నుంచి రూ. 24,780 వ‌ర‌కు నెల‌వారీ వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://careers.ecil.co.in/login.php ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఏప్రిల్ 11, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.

    Jobs in AP: క‌ర్నూలు జిల్లాలో కాంట్రాక్ట్ జాబ్స్‌.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    పోస్టుల వివ‌రాలు..























    జూనియర్ టెక్నీషియన్ విభాగాలుపోస్టుల సంఖ్యవేతనం
    ఎలక్ట్రానిక్స్ మెకానిక్814రూ. 20,480
    ఎలక్ట్రిషియన్184రూ. 22,528
    ఫిట్టర్627రూ. 24,780

    అర్హతలు..

    గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / ఎలక్ట్రీషియన్ / ఫిట్టర్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI సర్టిఫికేట్. పొంది ఉండాలి మ‌రింత స‌మాచారం కోసం నోటిఫికేష‌న్ ప‌రిశీలించండి.

    ఎంపిక విధానం..

    - అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

    - అర్హ‌త మెరిట్ ఆధారంగా 1:4 అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.



    - షార్ట్ లిస్ట్ అభ్య‌ర్థుల డాక్యుమెంట్ విరిఫికేష‌న్ అన‌త‌రం పోస్టింగ్ ఇస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Jobs in AP: గుంటూరు జిల్లా ఏపీవీవీపీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    - ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://careers.ecil.co.in/login.php ను సంద‌ర్శించాలి.

    - నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి.

    - త‌రువాత click here to apply లింక్ క్లిక్ చేయాలి.

    - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    - అనంత‌రం స‌బ్‌మిట్‌ చేసి, ఒక కాపీని భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.

    - ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 11, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, ECIL, Govt Jobs 2022, Job notification, JOBS

    తదుపరి వార్తలు