Home /News /jobs /

GOVT JOBS 202 JOBS IN HYDERABAD SALARY RS 22000 APPLICATION PROCESS QUALIFICATIONS EVK

Govt Jobs 2022: హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. వేత‌నం రూ.22,000.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, అర్హ‌త‌లు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Telangana | హైద‌రాబాద్‌లోని హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ సెకండ‌రీ స్కూల్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్‌, నాన్ టీచింగ్ విభాగాల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 22, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) సెకండ‌రీ స్కూల్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్‌, నాన్ టీచింగ్ విభాగాల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రైమ‌రీ స్కూల్ టీచర్ నుంచి ఐటీ టెక్నిక‌ల్ అసిస్టెంట్ వ‌రుకు జాబ్స్‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి ద‌ర‌ఖాస్తుకు అభ్య‌ర్థి వ‌య‌సు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఉద్యోగాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://halsecondaryschoolhyderabad.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌కు మార్చ్ 22, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Jobs in Hyderabad: డిగ్రీ అర్హతతో రూ.50,000 వేతనం.. ద‌ర‌ఖాస్తుకు రెండురోజే చాన్స్‌

     పోస్టుల వివ‌రాలు..





































































    పోస్టు పేరుఅర్హతలుఖాళీలువేతనం
    ప్రైమరీ స్కూల్ టీచర్గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బీఈడీ చేసి ఉండాలి. సీటెట్‌, రాష్ట్ర టెట్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.04రూ. 20,000
    ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - సైన్స్గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 55 శాతం మార్కులతో బాట‌నీ, జూయాల‌జీ, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బీఈడీ చేసి ఉండాలి. సీటెట్‌, రాష్ట్ర టెట్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.01రూ. 22,000
    ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - సోష‌ల్‌గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 55 శాతం మార్కులతో బీఏ, బీకాం, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బీఈడీ చేసి ఉండాలి. సీటెట్‌, రాష్ట్ర టెట్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.01రూ. 22,000
    డాన్స్ టీచర్గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో డాన్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి.01రూ. 19,000
    మ్యూజిక్ టీచ‌ర్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో సంగీతంలో డిగ్రీ చేసి ఉండాలి.01రూ. 19,000
    కౌన్సెల‌ర్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో సైకాల‌జీలో డిగ్రీ చేసి ఉండాలి.01రూ. 19,000
    అడ్మినిస్ట్రేటీవ్ స‌పోర్టీవ్ క్ల‌ర్క్‌కామ‌ర్స్‌లో గ్రాడ్యుయేష‌న్ చేసి ఉండాలి.01రూ. 19,000
    న‌ర్స‌రీ టీచ‌ర్‌ఎన్‌టీటీ, మాంటిస్సోరిలో గ్రాడ్యుయేష‌న్ చేసి ఉండాలి.01రూ. 19,000
    ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్ - ఫీమెల్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.01రూ. 20,000
    ఐటీ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో బీసీఏ లేద సంబంధిత కోర్సుల్లో అర్హ‌త సాధించాలి.01రూ. 19,000

    Telangana Jobs: టీఎస్ఏసీఎస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. వేత‌నం రూ.13,000.. అర్హ‌తలు ఇవే!



    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
    - ప‌రీక్ష‌లో మెరిట్ సాధించి వారికి ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి
    - మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://halsecondaryschoolhyderabad.in ను సంద‌ర్శించాలి.

    Step 3 - నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ద‌ర‌ఖాస్తు ఫాం ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Step 5 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తుఫాం నింపాలి.

    Step 6 - అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు జ‌త చేసి.
    The Principal,
    HAL Secondary School,
    HAL Township,
    Balanagar,
    Hyderabad-500042 అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 7 - ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 22, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Hyderabad, Job notification, JOBS, Jobs in telangana, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు