Home /News /jobs /

GOVT JOB PREPARATION CENTRAL GOVT JOB WITH INTER QUALIFICATION KNOW PREPARATION TIPS AND EXAM PROCEDURE EVK

Govt Job Preparation: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రిప‌రేష‌న్ టిప్స్‌, ప‌రీక్ష విధానం!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

SSC CHSL Preparation Plan | SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు స‌రైన ప్రణాళితో ఉండాలి. ప్ర‌తీ సంవ‌త్సంర ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు పోటీ ప‌డుతుంటారు. ఈ ప‌రీక్ష‌లో రాణించి ఉద్యోగం సాధించాలంటే పూర్తి ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన ప్రిప‌రేష‌న్ ఉండాలి.

ఇంకా చదవండి ...
  SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు స‌రైన ప్రణాళితో ఉండాలి. ప్ర‌తీ సంవ‌త్సంర ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు పోటీ ప‌డుతుంటారు. ఈ ప‌రీక్ష‌లో రాణించి ఉద్యోగం సాధించాలంటే పూర్తి ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన ప్రిప‌రేష‌న్ ఉండాలి. ఈ సారి SSC CHSL 2022 రాసే అభ్య‌ర్థుల కోసం కొన్ని ప్రిపరేషన్ చిట్కాలు పాటిస్తే చ‌క్క‌ని ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఏ ప‌రీక్ష‌కైనా స‌న్న‌ద్ధ‌త ముఖ్యం, మీకు స‌బ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం ఉంటే ఈ ప‌రీక్ష పాస్ కాలేరు. విష‌య ప‌రిజ్ఞానంతోపాటు వేగంగా స్పందించే త‌త్వం ఉండాలి. త‌క్కువ స‌మ‌యంలో స‌రైన స‌మాదాన్నాన్ని ఎంచుకోవ‌డానికి స‌బ్జెక్ట్ మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన అభ్యాసం వ‌ల్ల మాత్ర‌మే క‌చ్చిత‌మైన స‌మాధానాల‌ను ఎంచుకోగ‌ల‌రు.  ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2022 మార్చి 7 రాత్రి 11 గంటల్లోగా అప్లై చేయాలి. 2022 మార్చి 8 రాత్రి 11 గంటల్లోగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

  RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డీ ప‌రీక్ష‌ల‌పై 3 లక్ష‌ల విన‌తులు.. త్వ‌ర‌లో నోటిఫికేష‌న్‌: కేంద్ర మంత్రి

  ఈ పరీక్షలో వ‌చ్చే విభాగాలు..
  (i) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  (ii) జనరల్ ఇంటెలిజెన్స్
  (iii) ఇంగ్లీష్‌
  (iv) జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్

  ప‌రీక్షా విధానం..
  స‌బ్జెక్ట్ప్ర‌శ్న‌లుమార్కులు
  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2550
  జనరల్ ఇంటెలిజెన్స్2550
  ఇంగ్లీష్‌2550
  జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్2550

  టైర్ -1 ప‌రీక్ష‌కు సంబంధించి ముఖ్య‌మైన అంశాలు..

  RRB NTPC: రైల్వే నోటిఫికేష‌న్‌కు మూడేళ్లు.. పూర్త‌యిన క‌మిటీ గ‌డువు.. త్వ‌ర‌లో అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌!

  - SSC CHSL సాధారణంగా ప్రతి సంవత్సరం కొన్ని పునరావృతమయ్యే ప్రశ్నలు ఉంటాయి.
  ఈ అంశాల‌ను గుర్తిస్తే జనరల్ నాలెడ్జ్ చాలా స్కోరింగ్ కావచ్చు.

  - గణితానికి సంబంధించిన బేసిక్స్‌పై ఎక్కువ ప్ర‌శ్న‌లు అడుగుతారు. కాబ‌ట్టి పెద్ద సూత్రాల కంటే మౌలిక సూత్రాల అభ్యాసం అవ‌స‌రం.

  - SSC CHSL పరీక్ష తయారీకి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. సొంతంగా నోట్స్ చేసుకొవ‌డం వ‌ల్ల క‌రెంట్ ఎఫైర్స్ త‌ప్పులు లేకుండా ఆన్సర్ చేయొచ్చు.

  - తెలుగు మీడియం (Telugu Medium) నుంచి వ‌చ్చే వారికి ఇంగ్లీష్ (English) కాస్త క‌ఠినంగా అనిపించినా.. పర్యాయపదాలు, వ్యతిరేకపదాలు, వన్-వర్డ్ సబ్‌స్టిట్యూషన్ & ఇడియమ్స్/పదబంధాలు అభ్య‌సం చేసినా మంచి స్కోర్ చేయొచ్చు.

  ప్రిప‌రేష‌న్ ప్లాన్ ఎలా ఉండాలి..

  టైమ్ టేబుల్‌ని రూపొందించుకోండి: ప‌రీక్ష‌ప్రిప‌రేష‌న్ (Exam Preparation) అయ్యే వారు ముందుగా ఏం చ‌ద‌వాలి. ఎప్పుడు ఏ స‌బ్జెక్ట్‌కు ఎంత స‌మ‌యం కేటాయించాలో క‌చ్చితంగా టైం టేబుల్ ఉండాలి. మీ స‌క్సెస్ ఆ టైం టేబుల్ త‌యారీపై ఆధార ప‌డి ఉంటుంది.

  Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అప్లికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు

  కాన్సెప్ట్‌లపై దృష్టి: ఎక్కువ విష‌యాలు చ‌ద‌వ‌డం కాకుండా. అవ‌స‌ర‌మైన కాన్సెప్ట్‌ల‌ను నోట్ చేసుకొని వాటిని ప్రిపేర్ అవ్వాలి. రిపీటెడ్ ప్ర‌శ్న‌ల‌ను అభ్య‌సం చేస్తూనే వాటి కాన్సెప్ట్ నేర్చుకోండి. స్కోరింగ్ రిపీటెడ్ కాన్సెప్ట్ చాలా అవ‌స‌రం

  స్వీయ-అంచనా : ఎవ‌రికీ చెప్ప‌కున్నా మీకు మీరు త‌ర‌చూ అంచ‌నా వేసుకోవాలి. ప్ర‌తీ నాలుగు రోజుల‌కు మోడ‌ల్ పేప‌ర్ చేసి. మార్కుల వ్య‌త్యాసం గుర్తించడం. ఏ కాన్సెప్ట్ వీక్ ఉన్నారో అవి ప్రిపేర్ అవ్వాలి. స్వీయ అంచనాకు మించి మాస్టర్ ఎవ్వ‌రూ లేరు.

  మాక్ టెస్ట్‌లు: SSC CHSL ప్రిపరేషన్‌లో మాక్ టెస్ట్‌లు (Mock Test) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతీ ప‌రీక్ష‌లో 10 నుంచి 15శాతం రిపీటెడ్ ప్ర‌శ్న‌లు లేదా కాన్సెప్ట్‌లు ఉంటాయి. వీటిని త‌క్కువ క‌ష్టంతోనే నేర్చుకోవ‌చ్చు. ఇవీ మార్కులు పెంచుతాయి. మాక్ టెస్ట్‌లు రాయ‌డం ద్వారా వీటిని సుల‌భంగా సాధించ‌వ‌చ్చు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2022, Ssc exams

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు