Engineering Courses: కొత్తవి వచ్చేశాయ్.. పాతవి త‌గ్గాయి: ఇంజ‌నీరింగ్‌లో కొత్త కోర్సుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంజనీరింగ్ లో ప్ర‌వేశ పెట్టిన కొత్త కోర్సుల‌ను ప్ర‌భుత్వం ఆమోదించింది. ఈ ఏడాది నుంచి పలు కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌(Artificial Intelligence and machine learning), డాటాసైన్స్‌ కోర్సులను ఇంజ‌నీరింగ్‌లో ప్రవేశపెడుతున్నారు

  • Share this:
    సాంకేతికి విద్య‌లో నూత‌న మార్పులు తీసుకొచ్చేలా ప్ర‌వేశ పెట్టిన కొత్త కోర్సుల‌ను ప్ర‌భుత్వం ఆమోదించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికి విద్యాలో నూత‌న కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌(Artificial Intelligence and machine learning), డాటాసైన్స్‌ కోర్సులను ఇంజ‌నీరింగ్‌లో ప్రవేశపెడుతున్నారు. కొత్త కోర్సులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 149, జీవో 150)లను జారీచేసింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)తో పాటు ఎమర్జింగ్‌ టెక్నాలజీలుగా పేరొందిన పలు కొత్త కోర్సుల నిర్వహణపై కాలేజీలు ఆసక్తిచూపిస్తున్నాయి. దీంతో 2021-22 విద్యా సంవత్సరానికి 28 కాలేజీల్లో కోర్‌ కోర్సుల రద్దు, కొత్త కోర్సులకు అనుమతిచ్చిన‌ట్టు అయ్యింది. ప్రధాన కోర్సులుగా ప్రసిద్ధిచెందిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌(Electrical) తదితర విభాగాలకు రోజురోజుకు డిమాండ్‌ తగ్గుతోంది. దీంతో చాలా కాలేజీలు ఆయా కోర్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించి, కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.

    Scholarship program: కరోనా కారణంగా చదువుకొనేందుకు ఇబ్బందా.. అయితే స్కాలర్షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి


    వివిధ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఈ ఏడాది కోర్‌ కోర్సులకు సంబంధించి 2.,010 సీట్లు రద్దయ్యాయి. వీటి స్థానంలో కొత్త కోర్సులను క‌ళాశాల‌లు ప్ర‌వేశ‌పెడుతున్నాయి. ఒక్కో క‌ళాశాల(College) 60 నుంచి 180 సీట్ల వ‌ర‌కు కొత్త కోర్సులు ప్ర‌వేశ‌పెడుతున్నాయి.

    కొత్త కోర్సులు ప్ర‌వేశ‌పెడుతున్న కాలేజీలు..
    - గోక‌రాజు రంగ‌రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీలో ఈసీఈలో 120 సీట్లు తగ్గించి.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌లర్నింగ్‌ కోర్సులో 120 సీట్లను పెంచారు.
    - గేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌లో ఈఈఈ(EEE)లో 60, సివిల్‌లో 60, ఈసీఈలో 30 సీట్లు తగ్గించారు. వాటి స్థానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డాటా సైన్స్‌, సీఎస్‌ఈలో 60 సీట్ల చొప్పున పెంచారు.
    - సీవీఆర్‌ కాలేజీలో ఈసీఈ కోర్సులో 120కు తగ్గించి.. సీఎస్‌ఈలో 60 సీట్లు పెంచారు.
    - సెయింట్‌ మార్టిన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌(Civil), మెకానికల్‌లో 60 సీట్ల చొప్పున తగ్గించారు. వాటి బ‌దులుగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డాటాసైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌లో 60 సీట్ల చొప్పున పెంచారు.
    - విజ్ఞానభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఈఈఈ, ఈసీఈ(ECE), సివిల్‌, మెకానికల్‌ల కోర్సుల్లో 60 చొప్పున సీట్లు త‌గ్గించారు. వాటి స్థానంలో సీఎస్‌ఈ (డాటాసైన్స్‌)లో 120, సీఎస్‌ఈ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మిషన్‌ లర్నింగ్‌)లో 120 సీట్లు పెంచారు.
    Published by:Sharath Chandra
    First published: