Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులు

రాష్ట్రంలో వైద్యకు సబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే వారి కోసం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: November 6, 2020, 3:16 PM IST
Andhra Pradesh: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులు
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
రాష్ట్రంలో వైద్య విద్యకు సబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే వారి కోసం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతో ఏపీలో వైద్య విద్య ఫీజులు ఈ విధంగా మారాయి. ఇప్పటివరకు రూ.12,155గా ఉన్న ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా ట్యూషన్‌ ఫీజును రూ.15 వేలకు పెరిగింది. ప్రస్తుతం రూ.13,37,057గా ఉన్న బీ కేటగిరీ ఫీజును ప్రభుత్వం రూ. 12లక్షలకు తగ్గించింది. ప్రస్తుతం సీ కేటగిరీ ఫీజు రూ.33,07, 500గా ఉంది. దీనిని రూ. 36 లక్షలకు తగ్గించారు. మరో వైపు సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ.15 లక్షలకు సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2020-21 విద్యాసంవత్సరం నుంచి 2022-23 వరకు ఈ నూతన ఫీజులు అమల్లో ఉంటాయని వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఈ నూతన ఫీజులు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనారిటీ, నాన్‌మైనారిటీ కాలేజీలకు వర్తిస్తాయని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తున్నారు.

అయితే ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, 14 డెంటల్‌ కాలేజీలకు ఈ ఫీజులు వర్తించనున్నాయి. ఈ ఫీజులు కాకుండా ఇతర ఏ ఫీజులైనా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆయా యాజమాన్యాలను హెచ్చరించింది. మెడికల్, డెంటల్‌ అభ్యర్థులకు విధిగా ఉపకారవేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది.
Published by: Nikhil Kumar S
First published: November 6, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading