DIKSHA App: విద్యార్థులకు ఇంట్లోనే పాఠాలు... ఈ యాప్‌తో సాధ్యం

DIKSHA Portal | దీక్ష యాప్‌ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉపయోగించుకోవచ్చు. ఇందులో లొకేషన్‌ని బట్టి కోర్సులు కనిపిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేస్తే ఈ ప్రాంతంలో విద్యా విధానాన్ని బట్టి పుస్తకాలు, కోర్సులు ఉంటాయి.

news18-telugu
Updated: March 26, 2020, 5:21 PM IST
DIKSHA App: విద్యార్థులకు ఇంట్లోనే పాఠాలు... ఈ యాప్‌తో సాధ్యం
DIKSHA App: విద్యార్థులకు ఇంట్లోనే పాఠాలు... ఈ యాప్‌తో సాధ్యం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అసలే పరీక్షల సమయం. ఇంతలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్. మళ్లీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయోనని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఒకటే టెన్షన్. అయితే ఆ పరీక్షలకు ఇంకా బాగా చదువుకోవడానికి సమయం దొరికింది. ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి, నేర్చుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. ఇందుకోసం ఉచిత ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని గతంలోనే ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ-MHRD, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE కలిసి దీక్ష పేరుతో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని రూపొందించాయి. వెబ్‌సైట్‌తో పాటు యాప్ కూడా ఉన్నాయి. విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఇందులో చదువు కొనసాగించొచ్చు.

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT రూపొందించిన పాఠ్యపుస్తకాలన్నింటికీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీక్ష యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే సంబంధిత టాపిక్స్ ఓపెన్ అవుతాయి. ఆ టాపిక్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. విద్యార్థులు స్టడీ మెటీరియల్‌ను ఇక్కడ యాక్సెస్ చేయచ్చు. పాఠాలు నేర్చుకున్న తర్వాత సెల్ఫ్ అసెస్‌మెంట్ ప్రాక్టీస్ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. దీక్ష యాప్‌ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉపయోగించుకోవచ్చు. ఇందులో లొకేషన్‌ని బట్టి కోర్సులు కనిపిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేస్తే ఈ ప్రాంతంలో విద్యా విధానాన్ని బట్టి పుస్తకాలు, కోర్సులు ఉంటాయి.

ఉపాధ్యాయులు కూడా లెస్సన్ ప్లాన్స్, వర్క్ షీట్స్, యాక్టివిటీస్ కోసం దీక్ష ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు. మరి మీరు కూడా దీక్ష యాప్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలను యాక్సెస్ చేయాలంటే https://diksha.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. లేదా దీక్ష యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



ఇవి కూడా చదవండి:

Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఫ్రీ... ఖాళీ సమయంలో పూర్తి చేయండి

SWAYAM: ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలాRailway Jobs: రైల్వేలో 617 జేఈ, టికెట్ క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు