Jobs: ఐటీఐ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Central Govt Jobs | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐటీఐ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 19, 2020, 9:52 AM IST
Jobs: ఐటీఐ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Jobs: ఐటీఐ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞుల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. హెచ్ఆర్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్స్‌లో సీనియర్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. మొత్తం 37 ఖాళీలున్నాయి. భారతదేశంలోని యూనిట్లు, కార్యాలయాల్లో వీరిని నియమించనుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు 2020 మార్చి 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టులో పంపడానికి చివరి తేదీ 2020 మార్చి 25. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.itiltd.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

ITI Limited Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం పోస్టులు- 37
చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ / అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డీ)- 1
సీఎంఆర్ / జనరల్ మేనేజర్ / అడిషనల్ మేనేజర్ (లీగల్)- 1
మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 8
మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 8మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 8
డిప్యూటీ మేనేజర్ / మేనేజర్ (టెక్నికల్ అసిస్టెంట్ టు సీఎండీ)- 1
మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డీ)- 4
డిప్యూటీ జనరల్ మేనేజర్ / అడిషనల్ జనరల్ మేనేజర్ (పీఆర్)- 1
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1
జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్-స్టార్టప్ హబ్ (జనరల్ మేనేజర్)- 1
ప్రాజెక్ట్ హెడ్- సెల్ టెక్నాలజీ (అడిషనల్ జనరల్ మేనేజర్)- 1
ప్రాజెక్ట్ హెడ్- డేటా సెంటర్ (అడిషనల్ జనరల్ మేనేజర్)- 1

ITI Limited Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం- 2020 మార్చి 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 20
పోస్టులో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2020 మార్చి 25
విద్యార్హతలు- సీఏ / ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీఈ / బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం- http://www.itiltd.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో 2020 మార్చి 20 లోగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల్ని ప్రింట్ తీసి 2020 మార్చి 25 లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ADDL. GENERAL MANAGER,
ITI LIMITED,
REGD & CORPORATE OFFICE BHAVAN,
DOORAVANI NAGAR,
BENGALURU –560016.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీలో 5,000 పైగా అప్రెంటీస్ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Jobs: బీటెక్ పాసైనవారికి 259 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

DRDO Jobs: హైదరాబాద్‌ డీఆర్‌డీఓలో జాబ్స్... మార్చి 20 చివరి తేదీ
Published by: Santhosh Kumar S
First published: March 19, 2020, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading