Reservation: రిజర్వేషన్ల విషయంలో మోదీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం

Reservation: రిజర్వేషన్ల విషయంలో మోదీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం)

Reservation | వైద్య విద్యలో రిజర్వేషన్ల విషయంలో మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 5,000 పైగా విద్యార్థులకు మేలు చేయనుంది.

  • Share this:
    ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిప్లొమా, బీడీఎస్, ఎండీఎస్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేవారికి ఆల్ ఇండియా కోటా స్కీమ్‌లో ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్, ఎకనమికల్లీ వీకర్స్ సెక్షన్-EWS విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచే ఈ రిజర్వేషన్ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో వైద్య విద్య అభ్యసించాలనుకునే 5,550 మంది విద్యార్థులు లాభపడనున్నారు. వెనుకబడిన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నవారికి రిజర్వేషన్ కేటాయించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం సూచించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఎంబీబీఎస్ చదవాలనుకునే 1500 ఓబీసీ విద్యార్థులు, 550 ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, పీజీ చదవాలనుకునే 2500 ఓబీసీ విద్యార్థులు, 1000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మేలు చేయనుంది.

    UPSC Recruitment 2021: జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... రూ.1,42,000 వేతనం

    TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి


    1986లో సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆల్ ఇండియా కోటా స్కీమ్ అమలులోకి వచ్చింది. మెరిట్ విద్యార్థులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మంచి మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి ఆల్ ఇండియా కోటా స్కీమ్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాలో యూజీ సీట్స్ 15శాతం, పీజీ సీట్స్ 50 శాతం ఉంటాయి. 2007 వరకు ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్ స్కీమ్ లేదు. 2007 లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీ విద్యార్థులకు 7.5 శాతం కోటాను ఆల్ ఇండియా కోటాలో స్కీమ్‌లో చేర్చారు.

    Job Resume: ఆ పనే తన స్కిల్ అని చెప్పిన మహానుభావుడు... అది చూసే ఇంటర్వ్యూకి పిలిచిన కంపెనీ

    Principal Jobs: మొత్తం 363 ప్రిన్సిపాల్ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    మరోవైపు అడ్మిషన్లకు రిజర్వేషన్ల కోసం సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ యాక్ట్ 2007 లో అమలులోకి వచ్చింది. సఫ్దర్‌గంజ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి కేంద్ర విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. మెడికల్ కాలేజీల్లో మాత్రం రిజర్వేషన్ లేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఆల్ ఇండియా కోటా స్కీమ్‌లో ఓబీసీ విద్యార్థులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
    Published by:Santhosh Kumar S
    First published: