ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఏపీలోని 13 జిల్లాల్లో 14 టెలీ మెడిసిన్ హబ్స్ నిర్వహిస్తున్నారు. వీటిలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు వచ్చే నెల 6 (సెప్టెంబర్ 6)ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://hmfw.ap.gov.in/ ను సందర్శించాలని సూచించారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టు | ఖాళీలు |
పీడియాట్రీషియన్ | 14 |
గైనకాలజిస్ట్ | 14 |
మెడికల్ ఆఫీసర్లు | 28 |
జనరల్ ఫిజీషియన్ | 14 |
మొత్తం | 70 |
Qualification Details: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. పీడియాట్రీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్/డిప్లొమా చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు MBBS తో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
Salary Details: పీడీయాట్రీషియన్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. లక్ష వేతనం చెల్లించనున్నారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 53 వేల వేతనం ఉంటుంది.
Important Dates:
నోటిఫికేషన్ విడుదల ఆగస్టు 28
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 06
మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసే తేదీ సెప్టెంబర్ 08
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల సెప్టెంబర్ 10
అభ్యర్థులు అప్లికేషన్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకావాల్సి ఉంటుంది. పూర్తిగా నింపిన అప్లికేషన్ తో పాటు కింద సూచించిన సర్టిఫికేట్లను స్కాన్ చేసి spmuaprect@gmail.com కు ఈ మెయిల్ చేయాల్సి ఉంటుంది.
Notification & Application - Direct Link
దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికేట్ల కాపీ వివరాలు..
1.టెన్త్ సర్టిఫికేట్
2.ఇంటర్ సర్టిఫికేట్
3.ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్
4.మార్కుల మెమోలు
5.APMC రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
6.కుల ధ్రువీకరణ సర్టిఫికేట్
-క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. మొదటగా కాంట్రాక్ట్ గడువు ఏడాది ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Health jobs, Job notification