Telangana Jobs: నల్గొండలోని మెడికల్ కాలేజీలో జాబ్స్... రేపే ఇంటర్వ్యూ

Nalgonda Medical College Recruitment 2020 | ఆసక్తిగల అభ్యర్థులు 2020 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల్లోగా నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దరఖాస్తు సబ్మిట్ చేయాలి. అదే రోజున ఇంటర్వ్యూలు ఉంటాయి.

news18-telugu
Updated: February 23, 2020, 9:25 AM IST
Telangana Jobs: నల్గొండలోని మెడికల్ కాలేజీలో జాబ్స్... రేపే ఇంటర్వ్యూ
Telangana Jobs: నల్గొండలోని మెడికల్ కాలేజీలో జాబ్స్... రేపే ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్యూటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 24న ఇంటర్వ్యూ జరగనుంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ లాంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 25 ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు 2020 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల్లోగా నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దరఖాస్తు సబ్మిట్ చేయాలి. అదే రోజున ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://dme.telangana.gov.in/ లేదా http://gmcnalgonda.in/ వెబ్‌సైట్స్‌లో చూడొచ్చు.

Telangana Jobs, Nalgonda Medical College jobs, doctor jobs in telangana, mbbs jobs in telangana, Professor jobs in telangana, తెలంగాణ జాబ్స్, నల్గొండ మెడికల్ కాలేజీ జాబ్స్, డాక్టర్ జాబ్స్ తెలంగాణ, ఎంబీబీఎస్ జాబ్స్ తెలంగాణ, ప్రొఫెసర్ జాబ్స్ తెలంగాణ
Source: Nalgonda Medical College Notification

Nalgonda Medical College Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 25
ప్రొఫెసర్- 4


అసోసియేట్ ప్రొఫెసర్- 3
అసిస్టెంట్ ప్రొఫెసర్- 7ట్యూటర్స్- 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలు
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ- 2020 ఫిబ్రవరి 24 ఉదయం 11 గంటల నుంచి
విద్యార్హత- ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎండీ, ఎంఎస్ ఉండాలి. ట్యూటర్ పోస్టుకు ఎంబీబీఎస్ పాస్ కావాలి.
దరఖాస్తులు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్:
Principal office,
Government Medical College,
Nalgonda.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు

 
First published: February 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు