హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

New Notifications: ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. TSPSC, KVSతో పాటు ఇతర ఉద్యోగ వివరాలిలా..

New Notifications: ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. TSPSC, KVSతో పాటు ఇతర ఉద్యోగ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం సెంట్రల్ , స్టేట్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో మాత్రం వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయ. దీంతో నిరుద్యోగులు పుస్తలలతో కుస్తీ పడుతున్నారు. లైబ్రరీలో కుర్చీలు ఖాళీగా ఉండట్లే. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతం సెంట్రల్, స్టేట్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు(Notifications) విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో మాత్రం వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయ. దీంతో నిరుద్యోగులు పుస్తలలతో కుస్తీ పడుతున్నారు. లైబ్రరీలో కుర్చీలు ఖాళీగా ఉండట్లే.  ప్రతీ జిల్లాల్లో స్టడీ హాళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయంది. అయితే ఇక్కడ ఇటీవల విడుదలైన కొన్ని నోటిఫికేషన్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

యానిమల్ హస్బెండరీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

యానిమల్ హస్బెండరీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 2106 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2022. అంటే నేటితో ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే చేయబడుతుంది. దీని కోసం మీరు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలి bhartiyapashupalan.com . వయోపరిమితి 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

TSPSC Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ .. పూర్తి వివరాలివే

KVS Recruitment 2022:

KVS TGT, PGT, PRT, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా అనేక పోస్టులను నియమించనుది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 13404 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి KVS యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి kvsangathan.nic.in వెళ్లాలి. నమోదు ప్రక్రియ ఆన్‌ లైన్ లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు కోసం రూ. 1200, రూ. 1500, రూ. 2500 వరకు వివిధ రకాల పోస్టులను బట్టి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను తనిఖీ చేయండి.

TSPSC జేఎల్ నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. దీనిలో భాగంగానే పీఎల్ (పాలిటెక్నిక్ ), డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన టీఎస్పీఎస్సీ తాజాగా 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన దగ్గర నుంచి ఇంత వరకు జేఎల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. తాజాగా ఈ నోటిఫికేషన్ వెల్లడి కావడంతో.. నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించొచ్చు.

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల చేసింది. 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విద్యార్హతలు తదితర పూర్తి వివరాలు పూర్తి నోటిఫికేషన్లో ఉండనున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి నోటిఫికేషన్ ను త్వరలో అధికారిక వెబ్ సైట్లో అప్లోడ్ చేయనుంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించొచ్చు.

SAIL: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కన్సల్టెంట్స్ జాబ్స్‌కి సెయిల్‌ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు ఇలా..

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ నెల 14 నుంచి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

First published:

Tags: Central Government Jobs, JOBS, Kvs, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు