కేంద్రం పరీక్ష ఆధారంగానే ఉద్యోగాలు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం

కేంద్రం నిర్వహించే పరీక్ష ఫలితాల్లో స్కోర్ ఆధారంగానే తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించింది.

news18-telugu
Updated: August 21, 2020, 6:04 PM IST
కేంద్రం పరీక్ష ఆధారంగానే ఉద్యోగాలు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రభుత్వ పరిధిలోని పలు ఉద్యోగాల భర్తీని మరింత సులభతరం చేసేందుకు ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం జాతీయ నియామకాల సంస్థ(ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడయ్యింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఈ అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్రం నిర్వహించే పరీక్ష ఫలితాల్లో స్కోర్ ఆధారంగానే తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీని వల్ల అభ్యర్థులు అనేక పరీక్షలు రాసే శ్రమంతో పాటు ఇందుకోసం పలు ప్రాంతాలకు వెళ్లే అవసరం కూడా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఈ రకమైన నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఇతర రాష్ట్రాలు సైతం అభ్యర్థులకు ఊరట కలిగించే ఈ నిర్ణయం తీసుకోవచ్చని శివరాజ్ సింగ్ అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: August 21, 2020, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading