Home /News /jobs /

GOVERNMENT DEGREE COLLEGES ROLL OUT AI AND ML COURSES IN TELANGANA UMG GH

TS GOVT: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో కొత్త కోర్సులు

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థుల కోసం కొత్త కోర్సులను ప్రవేశపెడుతుంది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి 11 అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ‌ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అండ్ మె?

ఇంకా చదవండి ...
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో (Government Degree College)అండర్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థుల కోసం కొత్త కోర్సులను ప్రవేశపెడుతుంది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి 11 అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ‌ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అండ్ మెషిన్ లెర్నింగ్‌(ML)పై మూడు సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు AI అండ్ MLలను రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో ఇంజనీరింగ్ కోర్సుగా అందిస్తున్నాయి. గ్రాడ్యుయేట్‌లకు ఈ రంగంలో పుష్కలమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి. పైగా ఈ కోర్సుకు విద్యార్థులలో భారీ డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కోర్సును 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఈ ఏడాది నుంచి బీఎస్సీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఈ కొత్త కోర్సు కోసం 60 సీట్లు కేటాయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. అటానమస్ హోదా ఉన్న కాలేజీలకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఈ కోర్సు కోసం పాఠ్యాంశాలను డిజైన్ చేయనున్నాయి.

ఇదీ చదవండి: నీట్ ఎగ్జామ్ వాయిదాకు డిమాండ్.. విద్యాశాఖ మంత్రి స్పందన ఏంటంటే..?


AI అండ్ ML కోర్సుతో పాటు, ఈ కళాశాలలు BScలో గేమింగ్, యానిమేషన్, BBAలో రీటైలింగ్, బీఏలో కంటెంట్ & క్రియేటివ్ రైటింగ్‌, బీకామ్‌లో E-Com ఆపరేషన్స్, బీఎస్సీలో గ్రాఫిక్ డిజైన్ & డిజిటల్ అడ్వర్టైజింగ్, బీఏలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, బీబీఏలో లాజిస్టిక్స్‌, బీకాంలో అగ్రి స్టోరేజీ అండ్ సప్లై చైన్‌ అనే కొత్త కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నాయి. ఒక్కో కోర్సుకు 60 సీట్లు కేటాయించారు. ఈ కొత్త ప్రోగ్రామ్‌లను అప్రెంటీస్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులుగా పిలుస్తారు. ఈ కోర్సు చేసేవారికి ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఇంటర్న్‌షిప్‌లు కోర్సు పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చారు.



గత సంవత్సరం BA (ఆనర్స్) ఎకనామిక్స్, BA (ఆనర్స్) పొలిటికల్ సైన్స్ కోర్సులను ప్రభుత్వ సిటీ కాలేజ్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. తాజాగా ఈ విద్యా సంవత్సరంలో మరో కొత్త కోర్సు BA (ఆనర్స్) చరిత్రను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త కోర్సులో అడ్మిషన్స్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) ద్వారా జరగనున్నాయి.

మరోవైపు, ఐఐటీ హైదరాబాద్ ‘ఫ్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్’పై 12 నెలల సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు జులై 10లోపు దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆగస్ట్ 1, 2022 నుంచి ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 స్కాలర్‌షిప్ లభించనుంది. మరిన్ని వివరాలకు http://fwc.iith.ac.in/ వెబ్ సైట్ సందర్శించాలని ఐఐటీ హైదరాబాద్ సూచించింది.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Degree students, JOBS, Telangana government jobs

తదుపరి వార్తలు