GOOGLE TCS HARVARD UNIVERSITY AND OTHER ONLINE PLATFORMS OFFERING FREE ONLINE COURSES SS
Online Courses: ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్న 5 ప్లాట్‌ఫామ్స్ ఇవే
Online Courses: ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్న 5 ప్లాట్‌ఫామ్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Free Online Courses | ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు నేర్చుకోవాలనుకునేవారికి అనేక అవకాశాలున్నాయి. ప్రముఖ సంస్థలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ఫ్రీగానే కోర్సుల్ని అందిస్తున్నాయి.
లాక్డౌన్ సమయంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఖాళీ సమయంలో ఆన్లైన్ కోర్సులు చేయాలనుకుంటున్నారా? ఆన్లైన్లో కోర్సులు చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా కోర్సులు అందించే ప్లాట్‌ఫామ్స్ అనేకం ఉన్నాయి. విద్యార్థులు కొత్త అంశాలు నేర్చుకోవడానికి, ఉద్యోగులు స్కిల్స్ పెంచుకోవడానికి ఈ కోర్సులు ఉపయోగపడ్తాయి. వీరి కోసమే టీసీఎస్, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఉచితంగా కోర్సుల్ని అందిస్తున్నాయి. మరి ఏఏ ప్లాట్‌ఫామ్స్‌లో ఫ్రీగా కోర్సులు నేర్చుకోవచ్చో తెలుసుకోండి.
NASSCOM: నాస్కామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సును అందిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కోర్సుల్ని అందిస్తోంది. సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సు ఫీజు రూ.6,800 ఉంటుంది. కానీ మీరు ఈ కోర్సును 2020 మే 15 వరకు ఉచితంగా నేర్చుకోవచ్చు. ఆసక్తి గల వారు Skillup Online పోర్టల్‌లో ఈ కోర్సు చేయొచ్చు. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS 15 రోజుల డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ కోర్సు పేరు కెరీర్ ఎడ్జ్. టీసీఎస్‌కు చెందిన ఐయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ ప్లాట్ఫామ్లో ఈ కోర్సు చేయొచ్చు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగుల కోసం రూపొందించిన కోర్సు ఇది. ఈ ప్రోగ్రామ్‌లో నానో వీడియోస్, కేస్ స్టడీస్, అసెస్మెంట్స్ ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులు తమ బలాలు, బలహీనతల్ని తెలుసుకోవచ్చు. టీసీఎస్ నిపుణులు నిర్వహించిన రికార్డెడ్ వెబినార్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లో నేర్చుకోవచ్చు. ఈ కోర్సు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Harvard University: ప్రపంచంలోనే సుప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీ ఆన్లైన్లో 64 కోర్సుల్ని ఉచితంగా అందిస్తోంది. బిజినెస్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, ఆర్ట్ అండ్ డిజైన్, హెల్త్ అండ్ మెడిసిన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్‌లో ఈ కోర్సుల్ని ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులు ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ ద్వారా లాగిన్ అయి ఈ కోర్సులు చేయొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AICTE ELIS Portal: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE తో కలిసి ఎన్హాన్స్మెంట్ ఇన్ లెర్నింగ్ విత్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కిల్స్-ELIS ఆన్లైన్లో కోర్సుల్ని అందిస్తోంది. 18 ఎడ్ టెక్ కంపెనీలకు చెందిన 26 కోర్సులు చేయొచ్చు. 2020 మే 15 వరకు ఈ కోర్సులు ఉచితం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Google: ప్రపంచానికి పరిచయం అక్కర్లేని సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్ గూగుల్ కూడా ఉచితంగా ఆన్లైన్ కోర్సుల్ని అందిస్తోంది. డేటా అండ్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, కెరీర్ అండ్ డెవలప్మెంట్ లంటి కోర్సుల్ని ఉచితంగా చేయొచ్చు. 2 నుంచి 20 గంటల వ్యవధిలో ఈ కోర్సులు ఉంటాయి. ఉచిత కోర్సులతో పాటు పెయిడ్ సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. గూగుల్ డిజిటల్ అన్లాక్డ్ ప్లాట్ఫామ్లో ఈ కోర్సులు చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.