• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • GOOGLE JOBS 2020 GOOGLE TO RECRUIT 3800 GOOGLE CUSTOMER SUPPORT AGENTS IN INDIA BY THE END OF 2020 SS

Google Jobs 2020: గూగుల్‌లో ఉద్యోగాల జాతర... త్వరలో ఇండియాలో 3,800 పోస్టుల భర్తీ

Google Jobs 2020: గూగుల్‌లో ఉద్యోగాల జాతర... త్వరలో ఇండియాలో 3,800 పోస్టుల భర్తీ

Google Jobs 2020: గూగుల్‌లో ఉద్యోగాల జాతర... త్వరలో ఇండియాలో 3,800 పోస్టుల భర్తీ (ప్రతీకాత్మక చిత్రం)

Google Jobs 2020 | భారతదేశంలోని గూగుల్ కార్యాలయాల్లో 3,800 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది టెక్ దిగ్గజం. కస్టమర్ కేర్ సపోర్ట్ కోసం వీరిని నియమించుకోనుంది.

  • Share this:
    గూగుల్‌లో ఉద్యోగం... అనేకమంది యువతీయువకుల కల. గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తుంటారు. కష్టపడుతుంటారు. కానీ ఆ అవకాశం కొందరికే లభిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా ప్రతిష్టాత్మక సంస్థ గూగుల్‌లో ఉద్యోగం కోరుకుంటున్నారా? అయితే మీకు మంచి అవకాశం రాబోతోంది. త్వరలో గూగుల్ భారతదేశంలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఏకంగా 3,800 పోస్టుల్ని భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారతదేశంలోని అన్ని గూగుల్ కార్యాలయాల్లో వీరిని నియమించనుంది. గూగుల్ ఎక్కువగా తక్కువ వేతనంతో పనిచేసే ఉద్యోగులపై, థర్డ్ పార్టీ టెంపరరీ వర్కర్స్‌పై ఆధారపడుతుందని,విమర్శలు వచ్చాయి. దీంతో భారతదేశంలోని గూగుల్ కార్యాలయాల్లో 3,800 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది టెక్ దిగ్గజం. కస్టమర్ కేర్ సపోర్ట్ కోసం వీరిని నియమించుకోనుంది. ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్, యూజర్ సపోర్ట్, యూజర్స్‌తో కాల్స్ మాట్లాడటం, ప్రొడక్ట్ ట్రబుల్ షూటింగ్, క్యాంపైన్ లాంటి వాటికి థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడుతోంది గూగుల్.

    2020 లో మిస్సీసిప్పీలో గూగుల్ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభిస్తున్నాం. భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్‌లో విస్తరిస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా 4,800 గూగుల్ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను సృష్టించాం. అందులో ఇప్పటికే గూగుల్ ఆపరేషన్ సెంటర్స్‌లో 1,000 మంది గూగుల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లు పనిచేస్తున్నారు.
    ట్రాయ్ డిక్కర్‌సన్, వైస్ ప్రెసిడెంట్, గూగుల్ ఆపరేషన్స్ సెంటర్


    కస్టమర్లకు, యూజర్లకు సేవలు అందించేందుకు 2018లో గూగుల్ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభించి ఇన్ హౌజ్‌ ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇకపై థర్డ్ పార్టీపై ఆధారపడకుండా మొత్తంగా గూగుల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లను నియమించుకోనుంది. వీరికి గూగుల్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, బెనిఫిట్స్, మూడు వారాల పెయిడ్ వెకేషన్, 22 వారాల పెయిడ్ పేరెంటల్ లీవ్, సమగ్రమైన హెల్త్ కేర్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Realme X2: రియల్‌మీ ఎక్స్2 రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    ISRO Recruitment 2019: ఇస్రోలో 80 ఉద్యోగాలతో మూడో నోటిఫికేషన్... వివరాలివే

    Coal India Jobs: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1326 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

    LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు