Jobs: దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగం ఏది..? ఉద్యోగస్తుల ఓటు ఏ సంస్థకో తెలుసా..?

భారత్ లో టాప్ లో గూగుల్

భారత దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగ సంస్థ ఏది..? టాప్ 10లో ఉన్న సంస్థలు ఏవి.. ఎలాంటి సంస్థను ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడించింది ఓ సర్వే సంస్థ.. ఆ రిపోర్ట్ ఇదే..

  • Share this:
    భారత దేశంలో పలు మల్టీలెవెల్ కంపెనీలో భారీ ప్యాకేజీలతో ఆకర్షణీయమై ఉద్యోగాలు అందిస్తున్నాయి. కేవలం వేతనం విషయంలోనే కాదు అద్భుతమైన సౌకర్యాలు.. అధునూతన భవంతులతో తమ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ సర్వేలో ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్‌ బ్రాండ్‌గా టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తరువాత స్థానాల్లో అమెజాన్‌ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ ఇండియాలు నిల్చాయి. రాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) 2021 సర్వే నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన సర్వే చేయగా.. అందులో గూగుల్‌ ఇండియా అత్యధికంగా మార్కులు దక్కించుకున్నట్లు రాండ్‌స్టాడ్‌ ఇండియా ఎండీ విశ్వనాథ్‌ పీఎస్‌ తెలిపారు. చాలామంది ఉద్యోగులు ప్రస్తుతం గుగూల్ పని చేసేందుకే అత్యంత ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సంస్థ అంత ఆకర్షణీయంగా ఉండి ఉద్యోగులను ఆకట్టుకుంటోంది..

    భారత దేశంలో టాప్ 10 ఉద్యోగ సంస్థల జాబితా ఇదే.. 1. గూగుల్, 2.అమెజాన్ ఇండియా, 3. మైక్రోసాఫ్ట్ ఇండియా, 4. ఇన్ఫోసిస్, 5. టాటా స్టీల్, 6. డెల్‌, 7.ఐబీఎం, 8.టీసీఎస్, 9. విప్రో, 10. సోని వరుసగా నిలిచాయి. 34 దేశాల్లో 6,493 కంపెనీలపై నిర్వహించిన ఈ సర్వేలో 1,90,000 మంది పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పారు.

    ప్రస్తుతం ఉద్యోగార్థుల ఆలోచనా ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చినట్లు ఈసారి సర్వేలో వెల్లడైంది. వారు అటు ఉద్యోగ విధులు, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. వేతన ప్యాకేజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. ఈ అంశానికీ అంతే ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వే పేర్కొంది. దీని ప్రకారం.. ఆకర్షణీయమైన జీతభత్యాలతో పోలిస్తే (62%).. ఉద్యోగం, కుటుంబం మధ్య సమతౌల్యానికే(65%) ఉద్యోగార్థులు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైంది. కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణమైన పని వాతావరణం (61%), ఉద్యోగ భద్రత (61%) అంశాలు తర్వాత స్థానా ల్లో ఉన్నాయి. కంపెనీల ఎంపికలో ఉద్యోగార్థుల కొలమానాలు మారుతున్నాయని విశ్వనాథ్‌ తెలిపారు. తమకు విలువనిచ్చి అండగా నిలవడంతో పాటు తమ అభిప్రాయాలు, లక్ష్యాలకు అనుగుణమైన సంస్థలనే ఉద్యోగార్థులు ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
    Published by:Nagesh Paina
    First published: