హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Machine Learning: మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్‌లైన్ కోర్సును అందిస్తున్న గూగుల్.. పూర్తి వివరాలు ఇవే

Machine Learning: మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్‌లైన్ కోర్సును అందిస్తున్న గూగుల్.. పూర్తి వివరాలు ఇవే

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. " మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్సు విత్ టెన్సర్‌ఫ్లో API" పేరుతో అందిస్తున్న ఈ కోర్సును 15 గంటల్లోనే పూర్తి చేయొచ్చు.

ఇంకా చదవండి ...

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. " మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్సు విత్ టెన్సర్‌ఫ్లో API" పేరుతో అందిస్తున్న ఈ కోర్సును 15 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. గూగుల్ ఫ్రీ ఆన్‌లైన్ మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్సులో వీడియో లెక్చర్స్, రియల్-వరల్డ్ కేస్ స్టడీస్, హ్యాండ్-ఆన్ ప్రాక్టీస్ ఎక్సర్సైజులు వంటి అంశాలను నేర్చుకోవచ్చు.

ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులో పాటిస్పేట్ చేయొచ్చు. అయితే వారికి మెషీన్ లెర్నింగ్, NumPy, పాండాలు, బీజగణితం(Algebra), త్రికోణమితి, కాలిక్యులస్ మొదలైన వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మెషిన్ లెర్నింగ్‌ గురించి ఎలాంటి అవగాహన లేని వారి కోసం గూగుల్ 'మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ ఫ్రేమింగ్' పరిచయం చేసింది. ఈ కోర్సు లో పాల్గొని స్వయంగా మిషన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవచ్చు.

ఇది చదవండి: Oil India Jobs 2021: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 535 ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు

పార్టిసిపెంట్లకు ముందస్తుగానే మెషీన్ లెర్నింగ్‌లో పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ కోర్స్ సమయంలో ప్రజెంట్ చేసే కాన్సెట్స్‌ను అర్థం చేసుకోవడానికి.. ఎక్సర్సైజులు పూర్తి చేయడానికి పార్టిసిపెంట్లకు ముందస్తు అవసరాలు కావాలి. అవేంటో చూద్దాం.

అభ్యర్థులు ప్రోగ్రామర్లు అయ్యి ఉండాలి. తప్పనిసరిగా వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్స్ , ఫంక్షన్ల గ్రాఫ్‌లు, హిస్టోగ్రామ్‌లు, గణాంక మీన్స్ తెలుసుకొని ఉండాలి. ప్రోగ్రామింగ్ ఎక్సర్సైజులు పైథాన్‌లో ఉంటాయి కాబట్టి పైథాన్‌లో కొంత పరిజ్ఞానం కలిగి ఉండాలి. పైథాన్ పరిజ్ఞానం లేకపోయినా అనుభవజ్ఞులైన ప్రోగ్రామర్లు ప్రోగ్రామింగ్ ఎక్సర్సైజులను పూర్తి చేయగలరని గూగుల్ తెలిపింది.

కోర్సులో ఉండే అంశాలు:

కోర్సును పూర్తి చేసిన తర్వాత, పార్టిసిపెంట్లు మెషీన్ లెర్నింగ్‌ గురించి ప్రయోజనకరమైన బెనిఫిట్స్ తెలుసుకుంటారు. మెషిన్ లెర్నింగ్ ఉపయోగం గురించి అర్థం చేసుకుంటారు. ఉచిత ఆన్‌లైన్ కోర్సు అందించే అంశాల గురించి తెలుసుకుంటే.. మెషిన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్, ఫ్రేమింగ్, లోతైన మెషిన్ లెర్నింగ్, నష్టాన్ని, తగ్గించడం వంటి అంశాలు ఉంటాయి. అలాగే ఈ కోర్సులో కామన్ మెషిన్ లెర్నింగ్ టర్మ్స్(terms), మెషిన్ లెర్నింగ్ ఉపయోగించే మెషిన్ లెర్నింగ్ ఉత్పత్తుల ఉదాహరణలు.. సాధారణ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతులను ఉపయోగించే ఉత్పత్తుల ఉదాహరణలను వివరిస్తారు.

ఇది చదవండి : SSC GD Constable Exam 2021: ఆల‌స్యం చేయ‌కండి.. 25,271 పోస్టుల‌ ద‌ర‌ఖాస్తుకు ముగియ‌నున్న గడువు

మెషిన్ లెర్నింగ్ తో సమస్యను పరిష్కరించాలా వద్దా అనే అంశాలను కూడా ఈ కోర్సులో గూగుల్ అందిస్తోంది. ఇతర ప్రోగ్రామింగ్ పద్ధతులతో మెషిన్ లెర్నింగ్ సరిపోల్చడం.. తేడాలు గమనించడం అనేది కూడా ఇందులో ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ కి హైపోథిసిస్ టెస్టింగ్, సైంటిఫిక్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా అంశాలను ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు.

Published by:Krishna Adithya
First published:

Tags: Google

ఉత్తమ కథలు