కంప్యూటర్ సైన్స్ చదివే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు (Female Students) గూగుల్ ఇండియా (Google India) తీపి కబురు అందించింది. గర్ల్ హ్యాకథాన్ 2022 (Girl Hackathon) అనే ఓ లేటెస్ట్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులకు క్యాష్‌ప్రైజ్ ఆఫర్ చేస్తోంది గూగుల్. అంతేకాదు, గూగుల్‌లో జాబ్ సంపాదించేందుకు ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ కూడా అందిస్తోంది. ఈ ప్రోగ్రాంలో విన్నర్స్‌గా నిలిచిన ఫిమేల్ స్టూడెంట్స్ మాత్రమే వీటికి అర్హత సాధిస్తారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ (Computer Science Students) నుంచి గూగుల్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గర్ల్ హ్యాకథాన్ అధికారిక వెబ్సైట్ buildyourfuture.withgoogle.com ద్వారా కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల విద్యార్థినులు మూడు టీమ్‌ల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ ప్రోగ్రాం కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత సర్క్యూట్ బ్రాంచ్‌ల్లో అండర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న మహిళా విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రాం మార్చి 19, 2022 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ అనేది టీమ్స్ గానే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో టీమ్ లీడర్ ని డిక్లేర్ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి
ఈ ప్రోగ్రాం రెండు గ్రూప్స్ మధ్య డివైడ్ అవుతుంది. గ్రూప్-ఏ 2024, 2025 గ్రాడ్యుయేట్ల కోసం అందుబాటులో ఉంటుంది. బ్యాచిలర్స్, మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీలు, కంప్యూటర్ సైన్స్, అనుబంధ శాఖల్లో సంబంధిత కోర్సుల్లో చదివే విద్యార్థులకు గ్రూప్-ఏ అందుబాటులో ఉంటుంది. గ్రూప్-బీ అనేది బ్యాచిలర్స్, మాస్టర్స్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీలు, కంప్యూటర్ సైన్స్, అనుబంధ శాఖలలో సంబంధిత కోర్సుల్లో చదివే 2022, 2023 గ్రాడ్యుయేట్ల కోసం అందుబాటులో ఉంటుంది.
Calling women coders of tomorrow ??????#CrackTheCode and participate in our Girl Hackathon to win cash prizes, an interview with Google and cool merch.
Women students of computer science and allied courses can register in teams of 3 at: https://t.co/uIObrloSC4. pic.twitter.com/AXGnLBoko2
— Google India (@GoogleIndia) March 2, 2022
ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 9, 2022 తేదీలోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టీమ్ లీడర్ మొత్తం టీమ్ తరపున రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టీమ్ మెంబర్స్ వారి ప్రైమరీ, సెకండరీ ఈ-మెయిల్లను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే పార్టిసిపెంట్లు ఒకే క్యాంపస్‌కు చెందినవారై ఉండాలి. అయితే ర్యాండం సెలక్షన్ (Random Selection) ఎంపిక చేసుకున్న స్టూడెంట్స్ వివిధ క్యాంపస్‌ల నుంచి టీమ్ మెంబర్స్ ని తీసుకోవచ్చు. దీనిపై గూగుల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రోగ్రాం స్ట్రక్చర్
మొదటి రౌండ్లో పార్టిసిపేట్ చేసే వారందరూ గూగుల్ ఆన్లైన్ ఛాలెంజ్‌లో పాల్గొనవలసి ఉంటుంది. ఇది కోడింగ్/పజిల్‌ల రంగాల్లో పార్టిసిపెంట్ల ప్రతిభను ఆన్లైన్లో అంచనా వేసే కోడింగ్ ఛాలెంజ్. గూగుల్ ఆన్లైన్ ఛాలెంజ్ (జీఓసీ) మార్చి 19, 2022న జరుగుతుంది. తదుపరి రౌండ్‌కు వెళ్లే టీమ్స్ ఫలితాలు మార్చి 24, 2022న విడుదలవుతాయి. సెకండ్ రౌండ్ అనేది డిజైన్ డాక్యుమెంట్ రౌండ్. ఇందులో ఈ ఏడాది థీమ్ అయిన ఫ్యూచర్ ఆఫ్ లెర్నింగ్ అనే ఓ టెక్ థీమ్/ఛాలెంజ్ ఉంటుంది. దీనికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అవసరమవుతాయి. మీరు జీఓసీ (GOC) రౌండ్ లో ఫస్ట్ స్టెప్ క్వాలిఫై అయినట్లయితే థీమ్‌తో కూడిన డిజైన్ డాక్యుమెంట్ శాంపిల్ ని గూగుల్ మీకు షేర్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్ కాపీని తయారు చేసి, మీ పిచ్‌ను రూపొందించడానికి దాన్ని యూజ్ చేయాలి. డాక్యుమెంట్ ను మార్చి 24, 2022న గూగుల్ ఇండియా మీకు షేర్ చేస్తుంది. డిజైన్ డాక్యుమెంట్ సబ్ మిషన్స్ ఏప్రిల్ 7, 2022న ముగుస్తాయి. ఏప్రిల్ 13, 2022న చివరి హ్యాకథాన్ రౌండ్‌కు గైడ్ లైన్స్ తో సహా డాక్యుమెంట్ సబ్మిషన్ రిజల్ట్స్ విడుదలవుతాయి.
చివరి రౌండ్ వర్చువల్ హ్యాకథాన్‌గా ఉంటుంది. ఇక్కడ టీమ్స్ తమ ఫైనల్ సొల్యూషన్లను జడ్జిల ప్యానెల్‌కు అందజేస్తాయి. ఏప్రిల్ 22న టీమ్‌లు వర్కింగ్ డెమో/ప్రోటోటైప్, కోడ్ రిపోజిటరీని షేర్ చేయాల్సి ఉంటుంది. చివరి రౌండ్ ఏప్రిల్ 27, 2022న జరుగుతుంది. తుది ఫలితాలు ఏప్రిల్ 27, 2022న గూగుల్ ప్రకటిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Google