హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Google: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కి గుడ్‌న్యూస్‌.. బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ బేసిక్స్‌పై గూగుల్‌ ఫ్రీ కోర్సు..

Google: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కి గుడ్‌న్యూస్‌.. బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ బేసిక్స్‌పై గూగుల్‌ ఫ్రీ కోర్సు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google: బిగ్‌ డేటా అండ్‌ అనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ బేసిక్స్‌ నేర్చుకోవడానికి కంప్యూటింగ్ ఫౌండేషన్స్ విత్ కుబెర్నెట్స్ కోర్సును గూగుల్‌ లాంచ్‌ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బిగ్‌ డేటా అండ్‌ అనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ బేసిక్స్‌(Cloud Computing Basics) నేర్చుకోవడానికి కంప్యూటింగ్ ఫౌండేషన్స్ విత్ కుబెర్నెట్స్(Computing Foundations with Kubernetes) కోర్సును గూగుల్‌ (Google) లాంచ్‌ చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఎంట్రీ లెవల్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఈ కోర్సును అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది. ఈ కోర్సును అర్హత కలిగిన వ్యక్తులు ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఫ్యూచర్‌స్కిల్స్‌ ప్రైమ్‌, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమల సంస్థ నాస్కామ్‌కి చెందిన డిజిటల్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ సహకారంతో కోర్సును అందిస్తున్నట్లు గూగుల్‌ పేర్కొంది.

* ఐదు భాగాలుగా కోర్సు

క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ బేసిక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఉన్నత విద్యా సంస్థలలోని విద్యార్థులు, కెరీర్‌ ప్రారంభ దశలోని గ్రాడ్యుయేట్‌లకు ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు ఐదు-భాగాలుగా నిర్వహిస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్‌ చేయడానికి గూగుల్‌ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నారు.

* మొదట అమెజాన్‌, ఆ తర్వాత యాక్సెంచర్‌

దేశంలో క్లౌడ్-సంబంధిత అప్‌స్కిల్లింగ్‌కు సంబంధించి ఇది మొదటి ప్రోగ్రాం కాదు. జూన్ 9న అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) కింద క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ స్కిల్స్‌ను అందించడానికి విద్యా మంత్రిత్వ శాఖతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 8న, US-బేస్డ్‌ IT సేవల సంస్థ యాక్సెంచర్ కూడా భారతదేశంలోని ఎంట్రీ లెవల్‌ ప్రొఫెషనల్స్‌కు క్లౌడ్ నైపుణ్యాలను అందించడానికి AWS ‘రీ/ఇన్వెంట్’ చొరవతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది.

* ఇండియాలో డిజిటల్‌ నైపుణ్యాల కొరత

గూగుల్‌ అందిస్తున్న కోర్సు గురించి నాస్కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీర్తి సేథ్ మాట్లాడుతూ.. వ్యాపార వృద్ధికి క్లౌడ్ టెక్నాలజీలు చాలా కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాల కొరత సవాలుగా మారిందని చెప్పారు.

గూగుల్ క్లౌడ్‌లోని ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ అనిల్ భన్సాలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం క్లౌడ్, డేటా అనలిటిక్స్ స్కిల్స్ కీలకమని చెప్పారు. కంపెనీలు ఈరోజుల్లో క్లౌడ్‌కు తమ క్లిష్టమైన వర్క్‌లోడ్స్‌ను తరలించి, వాటి డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి : క్యాట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..

* 1.4 కోట్ల ఉద్యోగ అవకాశాలు

జులై 20న దేశంలో క్లౌడ్ టెక్నాలజీల అడాప్షన్‌పై నాస్కామ్ ప్రచురించిన ఇండస్ట్రియల్‌ రిపోర్ట్‌లో.. క్లౌడ్ టెక్నాలజీల వైపు కంపెనీల వలసలు రాబోయే నాలుగేళ్లలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి(GDP)కి 380 బిలియన్ల డాలర్లు అందించగలవని పేర్కొంది. క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌ల అడాప్షన్‌ 2016, 2021 మధ్య 44%కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేటు(CAGR)తో వృద్ధి చెందిందని పేర్కొంది.

మరిన్ని కంపెనీలు తమ కార్యకలాపాలకు టెక్నాలజీని వినియోగిస్తుండటంతో మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. దీంతో దేశంలో 1.4 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ వంటి సంస్థల చొరవతో అందుబాటులోకి వస్తున్న కోర్సులతో ఎక్కువ మంది నిపుణులు అందుబాటులోకి వస్తారని తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Cloud computing, EDUCATION, Google, JOBS

ఉత్తమ కథలు