GOOD OPPORTUNITIES FOR INDIAN STUDENTS IN US UNIVERSITIES HERE ARE THE THINGS THAT STUDENTS NEED TO KNOW GH VB
US Universities: ఇండియన్ స్టూడెంట్స్‌కు యూఎస్ వర్సిటీల్లో మంచి అవకాశాలు.. విద్యార్థులు ఈ విషయాలను తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
యూఎస్ లోని అధిక-నాణ్యత గల విద్యలో సౌకర్యవంతమైన పాఠ్యాంశాలు (Flexible Curriculum) ఉంటాయి. ఈ పాఠ్యాంశాలు విద్యార్థులను వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వివిధ క్లాసులు, మేజర్‌లు ఎంచుకోవడానికి వీలు కల్పిస్తూ ప్రోత్సహిస్తాయి.
అధిక-నాణ్యత (High-Quality) గల విద్యను కోరుకునే వేలాది మంది భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్‌లోని కాలేజీలు లేదా యూనివర్సిటీల్లో(University) చేరుతున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(Institute of International Education) ఏటా రూపొందించే ఓపెన్ డోర్స్ (Open Doors) నివేదిక ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో 2020-2021 విద్యా సంవత్సరంలో చేరిన ప్రతి ఐదుగురు అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు ఒకరు భారతదేశానికి చెందినవారు కావడం విశేషం. భారతీయ విద్యార్థులు (Indian Students) యూఎస్ యూనివర్సిటీలకు ఎక్కువగా ఎందుకు వెళ్తున్నారు? ఈ యూనివర్సిటీలో ఆఫర్ చేసే ప్రత్యేక సౌకర్యాలు ఏంటి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యూఎస్ లోని అధిక-నాణ్యత గల విద్యలో సౌకర్యవంతమైన పాఠ్యాంశాలు (Flexible Curriculum) ఉంటాయి. ఈ పాఠ్యాంశాలు విద్యార్థులను వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వివిధ క్లాసులు, మేజర్‌లు ఎంచుకోవడానికి వీలు కల్పిస్తూ ప్రోత్సహిస్తాయి. ఈ కోర్సులు అత్యున్నత స్థాయి పరిశోధనా సౌకర్యాలు, అంకితమైన సలహాదారులు, తరగతులను ఆఫర్ చేస్తాయి. ఇవి అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate), గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వాస్తవ-ప్రపంచ అనుభవం, ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు, క్రిటికల్ థింకింగ్ పై ప్రోగ్రామ్స్, పరిశోధన అవకాశాలను అందించే సహకార కార్యక్రమాలు కూడా అందిస్తాయి.
వ్యక్తిగతంగా చూస్తే.. అంతర్జాతీయ విద్యార్థులు సాంస్కృతిక సమ్మేళనాన్ని సులభతరం చేసే నిర్దిష్ట సేవల నుంచి ప్రయోజనం పొందుతారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి ముందే ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లను రూపొందించుకోవడం సాధ్యమవుతుంది. యునైటెడ్ స్టేట్స్‌లో విద్యార్ధులు చదువుకోవడానికి కారణం ఇక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు చదువుకునేందుకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అందుబాటులో ఉండటమే. యునైటెడ్ స్టేట్స్‌లో 2019-2020 విద్యా సంవత్సరం నాటికి 3,982 డిగ్రీ-గ్రాంటింగ్ పోస్ట్ సెకండరీ సంస్థలు ఉన్నాయి.
అలా విద్యార్థులు ఎంచుకునే విస్తారమైన ఎంపికలు యూఎస్ లో ఉన్నాయని ఒక విద్యావేత్త చెప్పుకొచ్చారు. అమెరికాలో చిన్న, మధ్యస్థ, పెద్ద యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని నగరాల్లో, మరికొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, కమ్యూనిటీ కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ కాలేజీలలో మీరు రెండు సంవత్సరాలు చదివి, అసోసియేట్ డిగ్రీని పొంది, ఆపై నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసేందుకు యూనివర్సిటీకి వెళ్ళవచ్చు. అంతర్జాతీయ విద్యార్థులకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించే యూనివర్సిటీలను కూడా స్టూడెంట్స్ ఎంచుకోవచ్చు.
కమ్యూనిటీ కాలేజీలో చదివిన వారు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందొచ్చు. కౌన్సెలర్లు, స్టెమ్ సెంటర్‌కు యాక్సెస్ మరింత సులభతరం కూడా అవుతుంది. విద్యార్థులు తమ రంగంలోని నిపుణులు కలవడం కూడా సాధ్యమవుతుంది. క్లాసుల్లో నేర్చుకున్న వాటిని వాస్తవ ప్రపంచానికి అన్వయించడానికి కావాల్సిన వనరులతో పాటు పరిశ్రమలోని వ్యక్తులను కలవడానికి, చాలా మంది సీనియర్, పరిజ్ఞానం ఉన్న నిపుణులతో చర్చించడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకమైన కాలేజీ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి యూఎస్ యూనివర్సిటీలు ఉత్తమంగా నిలుస్తాయి. క్లాస్‌లు, విద్యార్థి సంస్థలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, మరిన్నింటి ద్వారా తరగతి గదిలో, వెలుపల చాలా అంశాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. క్యాంపస్‌కు వచ్చిన విద్యార్థులు ఆసక్తి ఉన్న వాటిలో పాల్గొనడానికి పూర్తి సౌలభ్యం, స్వేచ్ఛ ఉంటుంది. అద్భుతమైన కమ్యూనిటీలు, అనుభవాలను సృష్టించడానికి కూడా స్వేచ్ఛ, సౌలభ్యం ఉంటుంది.
గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు తమ కెరీర్‌లను ఏర్పరుచుకోవడంలో యూఎస్ యూనివర్సిటీ సహాయపడతాయి. విద్యార్థులు విజయం సాధించేందుకు యూనివర్సిటీలు చాలా వనరులను అందిస్తాయి. అత్యాధునిక కెరీర్ మేనేజ్‌మెంట్ సెంటర్లు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లు, మానసిక, శారీరక ఆరోగ్య సహాయ సేవల వంటి అదనపు వనరులను కూడా యూనివర్సిటీలు ఆఫర్ చేస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.