UPSC Civils Exam: సివిల్స్ రాయాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

యూపీఎస్సీ సివిల్స్ (UPSC Civils) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్(Telangana BC Study Circle) గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు 2020 సివిల్స్ విజేతలతో (Civils Rankers) ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తోంది.

  • Share this:
    యూపీఎస్సీ సివిల్స్ (UPSC Civils) కోసం ప్రిపేర్ అవుతున్నారా! అయితే.. మీకు శుభవార్త! సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం, సివిల్స్ రాయాలనుకుంటున్న (Civils Exam) యువత కోసం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (Telangana BC Study Circle) సదావకాశాన్ని కల్పిస్తోంది. ఈనెల 28న రవీంద్రభారతిలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి 2020 సివిల్స్ విజేతలతో (Civils Rankers) ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ (Telangana) రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham IAS) పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సివిల్స్ పై ఆసక్తి ఉన్న వాళ్ళంతా పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. సివిల్స్ కు ఎలా ప్రిపేర్ (Civils Preparation Tips) కావాలి? ఆప్షనల్ గా ఎలాంటి సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకోవాలి? పరీక్షలో(Exam) విజయం సాధించడానికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం అవుతుంది? తదితర అనేక అంశాలు విజేతల ద్వారా తెలుసుకోవచ్చు.

    సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్లకి కావలసిన సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా వాళ్లు విజయం సాధించడానికి కావల్సిన అనేక విషయాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. సివిల్ సర్వీస్ సాధించాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలచారి ఒక ప్రకటనలో కోరారు. 2020 సివిల్స్ లో విజేతలుగా (2020 Civils Rankers) నిలిచిన తెలుగువారు ఏ కార్యక్రమంలో పాల్గొన్ని యువతకు మార్గదర్శనం చేస్తారని ఆయన తెలిపారు. ఈ సదావకాశాన్ని యువత వినియోగించుకుని ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.
    UPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

    ఇదిలా ఉంటే.. నిరుద్యోగులకు యూపీఎస్సీ (UPSC) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్​ లైన్​ నంబర్ (helpline number)​ను ఏర్పాటు చేసింది. యూపీఎస్సీ (UPSC) నిర్వహించే పరీక్షలకు పోటీపడే అభ్యర్థులు తాజా నోటిఫికేషన్ల సమాచారం, దరఖాస్తు విధానం, ఎగ్జామ్​ పాటర్న్​ (exam pattern) వంటి వివరాలను, సందేహాలను 1800118711 టోల్​ఫ్రీ నంబర్​ (toll-free number)కు ఫోన్​ చేసి సులభంగా తెలుసుకోవచ్చు.
    UPSC Civil Services Free Coaching: సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఫ్రీ కోచింగ్ అందిస్తున్న ఈ సంస్థల గురించి తెలుసుకోండి

    భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 'ఆజాది కా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrit Mahotsav)' వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూపీఎస్సీ (UPSC) పేర్కొంది. షెడ్యూల్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగ (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), వికలాంగ (PwD) అభ్యర్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో యూపీఎస్సీ ఈ 'హెల్ప్‌లైన్' నంబర్‌ను ప్రారంభించింది.
    Published by:Nikhil Kumar S
    First published: