• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • GOOD NEWS TO TELANGANA ELECTRICITY EMPLOYEES RETIREMENT AGE EXTENDED TO 61 YEARS HERE FULL DETAILS NS

Telangana: తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు

Telangana: తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు

విద్యుత్ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సమావేశం(ఫైల్)

తెలంగాణలోని విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వారి పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతూ టీఎస్ ట్రాన్స్ కో, టీఎస్ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Share this:
    తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వానికి చెందిన వివిధ కార్పొరేషన్లు, సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల్లోనూ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంచాలన్న డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ను 61 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు టీఎస్ ట్రాన్స్ కో, టీఎస్ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఆయా విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న క్లాస్ 1, 2, 3 ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెరగనుంది. అయితే జనరల్ సర్వీస్ ఎంప్లాయిస్ అంటే క్లాస్ 4 వారికి ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచారు.

    ఉత్తర్వుల్లో పేర్కొన్న ముఖ్యమైన విషయాలు..
    -ఈ ఉత్తర్వులు మార్చి 30 నుంచి అమల్లోకి రానున్నాయి.
    -విద్యుత్ సంస్థల్లో పని చేస్తూ మార్చి 30కి ముందు పదవీ విరమణ చేసిన వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు.
    -కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి ఈ ఉత్తర్వులు వర్తించవు.
    -మార్చి 30 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ ఉత్తర్వులు విడుదలైన రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.
    -అయితే వారు తమకు చెల్లించిన వివిధ బెనిఫిట్స్ కు సంబంధించిన మొత్తాన్ని తిరిగి సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ చెల్లించడంలో ఆలస్యమైతే ఆ మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

    ఇదిలా ఉంటే.. కరోనా మొదటి వేవ్ కంటే రెండవసారి వస్తున్న కరోనా చాలా ప్రమాదకరంగా తయారైందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు..ఫస్ట్ వేవ్‌కు, సెకండ్ వేవ్‌కు మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. కాగా అప్పుడు 20 శాతం మంది రోగులు ఆసుపత్రుల్లో చేరితే సెకండ్ వేవ్ లో 95శాతం మంది ఆసుపత్రిలో చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంలో వైద్యులు ఇతర సిబ్బంది ఎలాంటీ ధర్నాలకు వెళ్లవద్దని విజ్ఝప్తి చేశారు. ఇదే సంధర్భంలో పది పడకల ఆసుపత్రికి కూడ కోవిడ్ సేవలు అందించేకు అనుమతి ఇచ్చామని చెప్పారు.

    కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ అప్రమత్తమైంది. కరోనాకు సంబంధించి ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వార పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉండే విధంగా ఆశా వర్కర్లు ,మరియు ప్రాధమిక కేంద్రాల వైద్యులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రవేటు ఆసుపత్రుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు సూపర్ స్పైషాలిటి ఆసుపత్రుల్లో మాత్రమే కరోనాకు చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం పది పడకల ఆసుత్రులకు కూడా కరోనా చికిత్స చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు