Visakhapatnam: అందాల సాగర నగరం విశాఖపట్నం (Visakhapatnam) ఆంధ్ర యూనివర్శిటీ (Andhra Pradesh)లో అమెరికన్ కార్నర్ (American Corner)ను వర్చువల్ విధానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) ప్రారంభించారు. దీంతో దేశంలో విశాఖపట్నం మూడో అమెరికన్ కార్నర్ ప్రారంభమైంది. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికన్ కార్నర్ ద్వారా పలు అంశాలపై సమగ్ర అవగాహన పొందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ (Hyderabad)రీజియన్ అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు. అమెరిన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో ఈ ‘అమెరికన్ కార్నర్’ ఏర్పాటు చేశారు. యూఎస్ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి ఈ కార్నర్ సేవలు అందించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్ తోపాటు, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.
దేశంలో ఇది మూడో అమెరికన్ కార్నర్ కార్యాలయం. విద్యార్థులకు అవసరమయ్యే పలు ఉపయుక్తమైన కార్యశాలలను అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఇక్కడ నిర్వహిస్తారు. అమెరికా వెళ్లాలనుకునే వారు పలు అంశాలపై ఇక్కడ సమగ్ర అవగాహన పొందవచ్ఛు అందుకు వీలుగా కార్నర్లోని కంప్యూటర్లలో సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. పుస్తకాల సాఫ్ట్ కాపీలతోపాటు, వీడియో క్లిప్పింగులను కూడా సిద్ధం చేశారు.
అమెరికా దేశ సంస్కృతిని తెలిపే అంశాలన్నీ అందుబాటులో ఉంటాయి. అంకుర సంస్థలు ఏర్పాటుకు, వాటిని విజయవంతంగా కొనసాగించటానికి అవసరమైన ప్రణాళికలపైనా తగిన అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం 20 మంది అత్యంత సౌకర్యవంతంగా కార్యాలయ సేవలు పొందడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
సెంటర్ నిర్వహణ వ్యవహారాలను ఏయూ పర్యవేక్షిస్తుంది. అందుకు అయ్యే వ్యయాన్ని, కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను అమెరికా రాయబార కార్యాలయ అధికారులు నిర్వహిస్తారు. ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తారన్న సమాచారం ముందుగా తెలియజేస్తారు. అవసరాన్ని బట్టి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అమెరికాకు సంబంధించిన వివిధ రంగాలపై అవగాహన కల్పించే పుస్తకాలతో మినీ గ్రంథాలయాన్ని సైతం తీర్చిదిద్దారు. మహిళా సాధికారత, సాంకేతిక పరిజ్ఞానాలు, పర్యావరణం తదితర సామాజికాభివృద్ధికి ఉపయుక్తమైన అంశాలకు అగ్రప్రాధాన్యం ఇస్తారు. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచుకోవాలనుకునే వారికి సైతం తగిన సూచనలు చేస్తారు.
ఇదీ చదవండి: ఎగ్ దోశకు తినడానికి డబ్బులు అడిగితే అమ్మ నో అంది.. బీటెక్ విద్యార్థి ఏం చేశాడంటే..?
ఏయూలో ఏర్పాటవుతున్న అమెరికన్ కార్నర్‌లో ఆ దేశ అధికారులే కావాల్సిన సమాచారం మొత్తాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఇది విద్యార్థులకు వరమే. అమెరికా వెళ్లాలనే కలను సాకారం చేసుకోవడానికి మార్గదర్శిలా నిలుస్తుంది. దీంతోపాటు పలు సామాజిక అంశాలపై యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు అని వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra university, Ap cm jagan, AP News, USA, Visakha, Visakhapatnam