news18-telugu
Updated: October 5, 2020, 12:35 PM IST
ISRO Courses: స్పేస్ సైన్స్ గురించి ఆసక్తి ఉందా? మీకోసమే ఇస్రో ఉచిత కోర్సులు
(ప్రతీకాత్మక చిత్రం)
స్పేస్ సైన్స్ పై ఆసక్తి ఉన్నవారికి ఒక శుభవార్త. అంతరిక్ష విజ్ఞానం గురించి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలనుకునేవారికి ఉచితంగా కోర్సులు నేర్పిస్తామని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రకటించింది. స్పేస్ సైన్స్‌కు సంబంధించిన ఆన్లైన్ కోర్సులను ఇస్రో తాజాగా అభివృద్ధి చేసింది. ఈ ఆన్లైన్ కోర్సులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉచితంగా ఇస్రో వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఇస్రో మొత్తం మూడు ఆన్లైన్ కోర్సులను ప్రవేశ పెట్టింది. వాటిల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా ఉండటం విశేషం. అంతరిక్ష విశేషాల గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక విద్యార్థులకు, పరిశోధకులకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జియో కాంప్యుటేషన్, జియో వెబ్ సర్వీసెస్ అంశాల్లో కోర్సులను రూపొందించింది ఇస్రో. వీటి వ్యవధి ఏడు నుంచి 12 రోజుల వరకు ఉంటుంది. ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోర్సుల కోసం ఇస్రో వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని ఇస్రో ప్రకటించింది. ఈ కోర్సుల గురించి మరిన్ని వివరాలు ఇవే.
Online Courses: కేరళ యువతి సంచలనం... 90 రోజుల్లో 350 ఆన్లైన్ కోర్సులు పూర్తిJobs: ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్‌లో 550 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
1. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్: భౌగోళిక అంశాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి ఈ కోర్సులో నేర్పిస్తారు. ఇందులో జియోగ్రాఫికల్ ఫినామినా, కాన్సెప్ట్స్ వంటి అధ్యయనాలను ఉదాహరణలతో సహా వివరించనున్నారు. ఈ కోర్సు వ్యవధి నాలుగు వారాలు. అక్టోబరు 15 వరకు తరగతులు ఉంటాయి. డేటా ఇన్పుటింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్పేషియల్ ఎనాలసిస్, ఇంటర్డ్యూసరీ కాన్సెప్ట్స్ అండ్ ఓవర్ వ్యూ.. వంటి అధ్యాయాలు ఈ కోర్సులో భాగంగా ఉన్నాయని ఇస్రో ప్రకటించింది.
2. బేసిక్స్ ఆఫ్ జియో కాంప్యుటేషన్ అండ్ జియో వెబ్ సర్వీసెస్: ఈ కోర్సులో నమోదు చేసుకున్నవారికి జియో కాంప్యుటేషన్ గురించి పూర్తిగా నేర్పిస్తారు. ఇది రెండు వారాల కోర్సు. అక్టోబరు 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అక్టోబరు 29తో కోర్సు ముగుస్తుంది. జియో కాంప్యుటేషన్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్, ఇంట్రడక్షన్ టూ ఆన్లైన్ జీఐఎస్, జియో వెబ్ సర్వీసెస్ అండ్ రెపోసిటరీస్, ఇస్రో జియో వెబ్ సర్వీసెస్, ప్రోగ్రామింగ్ అండ్ కాన్సెప్ట్స్ ఫర్ జియో కాంప్యుటేషన్, ఇంట్రడక్షన్ టూ పైథాన్ అండ్ ఆర్... వంటి అంశాలు ఈ కోర్సులో భాగంగా ఉన్నాయి.
Degree Fellowship: విద్యార్థులకు గుడ్ న్యూస్... నెలకు రూ.5,000 ఫెలోషిప్ పొందడానికి ఇలా అప్లై చేయండి
Army Public School Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8000 ఉద్యోగాలు... విద్యార్హతలు ఇవే3. రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ అప్లికేషన్స్: రిమెట్ సెన్సింగ్కు సంబంధించిన అంశాల గురించి ఈ కోర్సులో పూర్తిగా నేర్చుకునే అవకాశాన్ని ఇస్రో కల్పించింది. దీంతో పాటు జీఐఎస్ అప్లికేషన్స్ ఫర్ క్రాప్ రిసోర్స్ అసెస్మెంట్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ ఫర్ జియోలాజికల్ స్టడీస్ వంటి వివిధ అంశాలపై పూర్తి పట్టు సాధించేలా కోర్సును డిజైన్ చేశారు. ఈ కోర్సు నవంబరు రెండున ప్రారంభమయ్యి, నవంబరు 20న ముగుస్తుంది. ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఇస్రో వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు.
Published by:
Santhosh Kumar S
First published:
October 5, 2020, 12:35 PM IST