IIM Indore Online courses | మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్ అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రముఖ విద్యాసంస్థలు. తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM Indore) ఇండోర్ కొత్త ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను (Onlice certificate Course) ప్రారంభించింది. ఎడ్‌టెక్ కెంపెనీ జిగ్‌సా వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందిస్తుంది. సేల్స్ ప్రొఫెషనల్స్ (Sales professionals) , ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఈ ఆన్‌లైన్ కోర్సును డిజైన్ చేసింది. విక్రయాల పట్ల లోతైన అవగాహన కల్పించేందుకు, సేల్స్ టీమ్ బిల్డింగ్ (Sales team building), డిజిటల్ నైపుణ్యాలను (Digital skills) పెంపొందించడంలో ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ కోర్సు మొత్తం నాలుగు నెలల పాటు ఉంటుంది. పరిశ్రమ అనుభవజ్ఞులచే ఈ కోర్సును నిర్వహిస్తారు.
నేటి సేల్స్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా అమ్మకాలు పెంచుకోవడంపై ఈ డిజిటల్ లైవ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దృష్టి సారిస్తుంది. కేవలం నేర్చుకోవడమే కాకుండా నైపుణ్యాలపై పట్టు సాధించడంపై కూడా శిక్షణనిస్తారు. ఒక జట్టు లేదా సంస్థను సేల్స్ మార్కెట్లో విజయవంతంగా నడిపించడమే లక్ష్యంగా ఈ కోర్సును అభివృద్ది చేసింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ మాట్లాడుతూ "మా సేల్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే ఉన్న సేల్స్ నిపుణులతో పాటు కొత్తగా ఈ రంగంలో రాణించాలనుకునే వారిని డైనమిక్, రెవెన్యూ డ్రైవింగ్, సేల్స్ ఫోర్స్‌గా తీర్చిదిద్దుతాం." అని చెప్పారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలు, పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త కోర్సును డిజైన్ చేసినట్లు ఆయన తెలిపారు.
ఎడ్‌టెక్ సంస్థ జిగ్‌సా భాగస్వామ్యంతో..
ఈ కొత్త కోర్సుపై జిగ్‌సా సీఈవో, కో ఫౌండర్ గౌరవ్ వోహ్రా మాట్లాడుతూ "భారత్‌లో సేల్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో సేల్స్ ప్రొఫెషనల్ కావాలని కోరుకునే ఎవరైనా సరే ఈ నాలుగు నెలల ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవచ్చు. వారికి అనుభవజ్ఞులతో శిక్షణ ఉంటుంది. సేల్స్ మార్కెట్ డిజిటలైజేషన్‌ను అందిపుచ్చుకోవడం మంచి విషయం.
ఎక్కువ నైపుణ్యం ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు
నేటి కాంపిటీషన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలను నమోదు చేయడం అనేది నైపుణ్యంతో కూడుకున్నది. దీనికి జ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం ఎంతో అవసరం. అందుకే, సేల్స్ నిపుణులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా నేర్పిస్తాం. ఈ కోర్సు మిమ్మల్ని అత్యుత్తమ సేల్స్ స్ట్రాటజిస్ట్‌లుగా తీర్చిదిద్దుతుంది" అని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online classes