Home /News /jobs /

GOOD NEWS TO LAW ASPIRANTS GOVERNMENT OFFERING FREE COACHING HERE IS DETAILS NS GH

Law Coaching: లా చేయాలనుకుంటున్న వారికి శుభవార్త.. అడ్మిషన్ టెస్ట్ కోసం ఫ్రీ కోచింగ్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు లా ప్రవేశ పరీక్షకు (Law Entrance Exam) శిక్షణ తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఇటీవల ఉచిత కోచింగ్‌ను (Free Coaching) ప్రారంభించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
న్యాయవాద వృత్తిలో పెరుగుతున్న అవకాశాల కారణంగా ఏటా న్యాయ విద్యనభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంజినీరింగ్(Engineering)​, మెడిసిన్(Medicine)​ వంటి వృత్తివిద్యల తరహాలోనే న్యాయవాద వృత్తికి సైతం డిమాండ్​ పెరుగుతోంది. ఏటా వేలాది మంది విద్యార్థులు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) పరీక్షకు (Exam) పోటీపడుతున్నారు. ఆన్‌లైన్​, ఆఫ్​లైన్​లో స్టడీ మెటీరియల్ సమృద్ధిగా ఉన్నప్పటికీ, సరైన గైడెన్స్​ లేక చాలా మంది విద్యార్థులు (Students) క్లాట్​లో విఫలమవుతున్నారు. బయట ఇన్​స్టిట్యూట్​లు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిలో శిక్షణ కోసం ఎక్కువ మొత్తంలో ట్యూషన్​ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అందుకే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు శిక్షణ (Coaching) తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఇటీవల ఉచిత కోచింగ్‌ను ప్రారంభించాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి అనుప్రతి కోచింగ్​ యోజన
న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి గల విద్యార్థుల కోసం రాజస్థాన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అనుప్రతి కోచింగ్ యోజనను ప్రారంభించింది. అర్హత గల 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత క్లాట్​ కోచింగ్​ అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఈ ఉచిత కోచింగ్​కు అర్హులు. అయితే, వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అభ్యర్థుల ఎంపిక 10, 12 తరగతులలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత శిక్షణతో పాటు ఆహారం, వసతి సౌకర్యం కూడా అందిస్తోంది. దీని కోసం రాజస్థాన్​ ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై రూ. 40 వేలు ఖర్చు చేస్తుంది.
Courses: విద్యార్థుల్లో ఆ కోర్సుల పట్ల పెరుగుతున్న ఆసక్తి.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన
న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి గల విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉచిత శిక్షణ అందిస్తోంది. అన్ని కులాలు, వర్గాల అభ్యర్థులను న్యాయ విద్యలోప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ ప్రభుత్వం జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, జాతీయ స్థాయి న్యాయ పరీక్ష (క్లాట్​) కోసం ప్రిపేరయ్యే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు ప్రభుత్వం నాణ్యమైన కోచింగ్‌ను అందిస్తుంది. ఉచిత శిక్షణలో అడ్మిషన్​ పొందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ. 2500 స్టైఫండ్‌ కూడా అందిజేస్తుంది. అర్హత, ఆసక్తి గల వారు పహుజా లా అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Microsoft: నిరుద్యోగులకు మైక్రోసాఫ్ట్​ గుడ్​న్యూస్​.. సైబర్​ సెక్యూరిటీలో ఉచిత ఆన్​లైన్​ ట్రైనింగ్.. వివరాలివే

మినిస్ట్రీ ఆఫ్​ సోషల్​ జస్టిస్​ అండ్​ ఎంపవర్​మెంట్ ఫ్రీ కోచింగ్​ స్కీమ్​
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్​మెంట్​.. న్యాయవిద్య పట్ల ఆసక్తి గల ఎస్సీ, ఓబీసీ విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువ ఉన్న వారు మాత్రమే దరఖాస్తు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు www.coaching.dosje.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెలా రూ. 3,000 స్టైపెండ్ అందజేస్తారు. అదనంగా, వికలాంగ విద్యార్థులకు రూ. 2,000 ప్రత్యేక భత్యం కూడా అందజేస్తారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు