Home /News /jobs /

IT Jobs: ఫ్రెషర్స్ కు HCL శుభవార్త.. త్వరలో 22 వేల నూతన నియామకాలు.. వివరాలివే

IT Jobs: ఫ్రెషర్స్ కు HCL శుభవార్త.. త్వరలో 22 వేల నూతన నియామకాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఐటీ దిగ్గజం HCL నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలో 22 వేల ఫ్రెషర్స్ ను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  కరోనా నేపథ్యంలో అనేక రంగాలు దెబ్బతిన్నా ఐటీ రంగం మాత్రం పుంజుకుంది. ఈ రంగంలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. అనేక మంది కోవిడ్ దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రం ఆ పరిస్థితి రాలేదు. ఇంకా అనేక కంపెనీలు వేతనాల పెంపుతో పాలు వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో తమ సిబ్బందికి ప్రోత్సహకాలు సైతం అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ HCL కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మొత్తం 20 వేల నుంచి 22 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని తెలిపింది. ఈ సంఖ్యను దాటే అవకాశం కూడా ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు HCL చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ వీ.వీ.అప్పారావు వివరాలను వెల్లడించారు. గతేడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 14,600 మంది ఫ్రెషర్లను నియమించుకుందని తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో 6 వేల మందిని నూతనంగా నియమించుకుంటున్నామని వెల్లడించారు. కంపెనీ ఉద్యోగులందరికీ 100 శాతం టీకాలు వేయించనున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 74 శాతం పూర్తయిందని వివరించారు.
  Software Jobs: ఆ కంపెనీలో 12,000 మంది ఫ్రెషర్స్‌కి జాబ్స్

  ఇదిలా ఉంటే.. కంపెనీ ఈ త్రైమార్షికంలో గతాడాదితో పోల్చితే 11.7 శాతం వృద్ధి నమోదు చేసింది. కంపెనీ ఆదాయం కూడా 15.5 శాతం పెరిగింది. అయితే ఇతర కంపెనీలతో పోల్చితే ఈ వృద్ధి రేటు చాలా తక్కువ. కానీ గతేడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దశలో హెచ్‌సిఎల్‌ సానుకూల వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. జూన్ త్రైమాసికం ఆఖరు వరకు HCLలో మొత్తం ఉద్యోగులకు సంఖ్య 1,76,499కి చేరింది. సంస్థలో వలసల రేటు 11.8 శాతంగా నమోదైంది.

  ఇదిలా ఉంటే.. తాజాగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.  1 నుంచి 4 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ కోసం నియామకాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జావా, డాట్ నెట్‌లో అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇన్ఫోసిస్ వెల్లడించింది. జులై 25వ తేదీలోగా అర్హత కలిగినవారు అప్లికేషన్లు పంపాలి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇన్ఫోసిస్ కెరీర్ ఆన్ లైన్ అసెస్మెంట్ క్లియర్ చేసి వర్చువల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించాలి.

  ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ కు బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. దీంతో పాటు 12 నుంచి 14 నెలల కనీస పని అనుభవాన్ని కలిగి ఉండాలి. బీసీఏ/బీఎస్సీ గ్రాడ్యుయేట్లు అయితే 24 నుంచి 36 నెలల సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job Mela, Job notification, Software developer

  తదుపరి వార్తలు