గత కొంతకాలంగా కాస్త కూల్‌గా ఉన్న ఐటీ కంపెనీలు తాజాగా వేగం పెంచాయి. కరోనా మహమ్మారి వల్ల అంతా డిజిటల్‌కు అలవాటుపడిన నేపథ్యంలో ఐటీ కంపెనీల అవసరం పెరిగింది. ఉన్న కంపెనీల్లో మ్యాన్‌పవర్ అవసరం ఇంకా పెరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని హైర్ చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా మ్యాన్‌పవర్ నియమించుకుంటున్నాయట. ఈ క్రమంలో వినూత్నమైన ఆలోచనలు కూడా చేస్తున్నారట. అవేంటో చూద్దాం! ఈ ఏడాదిలో తొలి ఆరు నెలల్లో దేశంలోని ప్రముఖ 10 ఐటీ కంపెనీలు 1.2 లక్షల మంది వరకు ఉద్యోగుల్ని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయట. వర్కఫ్రమ్ హోం అవకాశం, ఉద్యోగుల అవసరం పెరగడం లాంటి కారణాల వల్ల కొత్త ఉద్యోగుల కోసం ఐటీ సంస్థలు హైరింగ్ కెపాసిటీ పెంచాయట. అయితే వారికి తగ్గట్టుగా పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులు అందుబాటులోకి రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో జాయిన్ అయిన కొద్ది రోజులకు రాజీనామాలు చేస్తున్న సంఘటనలూ ఉన్నాయట.
Work From Home: ఆ కంపెనీ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం.. వివరాలివే..
IT Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర
దీంతోపాటు కొత్త అవకాశాలు, జీతాలు కనిపిస్తుండటంతో అప్పటివరకు పని చేస్తున్న ఉద్యోగులు వీడి పోతున్నారట. దీంతో సంస్థలు ఉద్యోగులతో బేరసారాలు మొదలుపెట్టాయట. సంస్థకు బాగా అవసరం, పనికొస్తారు అనిపించేవారితో ఇలాంటి బేరాలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో భారత్ పే లాంటి సంస్థలు తమ సంస్థలో కొత్తగా చేరే ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్‌లు ఇవ్వాలని నిర్ణయించాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీ కూడా ఇలాంటి ఆలోచనే చేసింది. ఉత్తమ ఉద్యోగుల్లో కొందరిని ఎంపిక చేసి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.
డేటా సైంటిస్ట్‌లు, ఫుల్ స్టాక్ ఇంజినీర్లు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, క్లౌడ్ ఆర్కిటెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు ఈ కాలంలో డిమాండ్ బాగా ఉందట. వారికి క్యాష్ బోనస్‌లు, ఐఫోన్లు లాంటివి ఇవ్వడానికి సంస్థలు ముందుకొస్తున్నాయట. వాళ్లు వేరే ఉద్యోగాల వైపు చూడకుండా ముందుగానే గిఫ్ట్‌లతో పట్టి ఉంచే ప్రయత్నం జరుగుతోందట. ముందుగా చెప్పుకున్నట్లు ఈ క్రమంలో మెరికల్లాంటి ఉద్యోగుల కొరత కూడా వేధిస్తోంది. అయితే మరోవైపు ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతేడాది కరోనా వల్ల ఎలాంటి నియామకాలు జరగని విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT Employees, Software developer