హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Salary Hike: ఉగాది పూట ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతంటే?

Salary Hike: ఉగాది పూట ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వేతన జీవులకు ఈ ఏడాది కాస్త ఊరట కలగనుంది. దేశంలోని ఉద్యోగులకు ఈ సంవత్సరం వేతనాలు పెరిగే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’(Ernst and Young) అనే ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ‘ఫ్యూచర్ ఆఫ్ పే’(Future Of Pay) 2023 నివేదికను రూపొందించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

వేతన జీవులకు ఈ ఏడాది కాస్త ఊరట కలగనుంది. దేశంలోని ఉద్యోగులకు ఈ సంవత్సరం వేతనాలు పెరిగే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’(Ernst and Young) అనే ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ‘ఫ్యూచర్ ఆఫ్ పే’(Future Of Pay) 2023 నివేదికను రూపొందించింది. ఈ ఏడాది ఉద్యోగుల సగటు వేతనం 10.2 శాతం మేర పెరగనున్నట్లు ఫ్యూచర్ ఆఫ్ పే రిపోర్ట్ వెల్లడించింది. మిడ్, లార్జ్ కంపెనీల్లోని చీఫ్ హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్స్ వెల్లడించిన అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్టును తయారు చేసింది. 2022 డిసెంబరు నుంచి 2023 ఫిబ్రవరి మధ్యలో ఈ సర్వేను చేపట్టింది.

ఈ మూడు రంగాల్లోనే ఎక్కువ

2023లో మూడు రంగాల్లోని ఉద్యోగులకు ఎక్కువగా జీతాలు పెరిగే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడించింది. ఈ కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో వేతనాలు అధికంగా పెరుగుతాయని అంచనా వేసింది. ఈ కామర్స్‌లో అత్యధికంగా 12.5 శాతం మేర వేతన వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. దీని తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్‌లో 11.9 శాతం, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో 10.8శాతం మేర వేతనాల్లో పెంపుదల ఉంటుందని రిపోర్టు తెలిపింది. ఈ మూడు రంగాలు టెక్నాలజీకి సంబంధించినవే కావడం గమనార్హం.

గతేడాదితో పోలిస్తే!

2022తో పోలిస్తే ఈ ఏడాదిలో సగటు వేతన వృద్ధి స్వల్పంగా తగ్గింది. భారత్‌లో గతేడాది సగటు వేతన వృద్ధి 10.4 శాతంగా నమోదైంది. ఈ దఫా 10.2శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. దీంతో గతేడాదితో పోలిస్తే వేతన వృద్ధి రేటు తక్కువేనని తెలిపింది. కానీ, 10 శాతానికి పైగా వృద్ధి నమోదు చేస్తుండటం గమనించాల్సిన విషయమని పేర్కొంది. అయితే, రైతులు, మెకానిక్‌లు, ఎలక్ట్రిషియన్లు, తదితర ఫీల్డ్ వర్కర్లకు సగటు వేతన వృద్ధి మరింతగా పడిపోనుందని రిపోర్టులో సంస్థ తెలిపింది.

స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్

ముఖ్యమైన నైపుణ్యాలు, కీ రోల్స్ కలిగిన వారికి డిమాండ్ కొనసాగుతుందని ‘ఫ్యూచర్ ఆఫ్ పే’ రిపోర్ట్ గుర్తు చేసింది. అన్ని సెక్టార్లలో వీరికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. దాదాపు 48శాతం కంపెనీలు స్కిల్స్ ఉన్న వారికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. మార్కెట్లో ఎక్కువగా అవసరమైన స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు ఆకర్షణీయ వేతనాలు చెల్లించేందుకు రెడీగా ఉన్నాయని నివేదికలో తెలిపింది. సాధారణ నైపుణ్యాలతో పోలిస్తే ప్రీమియం స్కిల్స్ కలిగిన వారికి ఇచ్చే వేతనాల నిష్పత్తి 1:1.8గా ఉండనుందని పేర్కొంది. మెరుగైన నైపుణ్యాలు కలిగిన వారికి సగటు వేతన వృద్ధి 1.9 రెట్లు ఉండనుందని స్పష్టం చేసింది.

ఈ రంగాల్లో పెరగనున్న ఉద్యోగాలు

2023లో వివిధ సెక్టార్లలో ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. పునరుత్పాదక శక్తి, ఈ కామర్స్, హెల్త్ కేర్, డిజిటల్ సర్వీసెస్, టెలీ కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, రిటైల్ అండ్ లాజిస్టిక్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ రంగాల్లో ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉండనుందని తెలిపింది. అర్హత కలిగిన వారికి ఈ రంగాల్లో పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు ఉండనున్నట్లు నివేదిక పేర్కొంది.

First published:

Tags: Employees, JOBS, Private Jobs, Salary Hike

ఉత్తమ కథలు