Freshers Jobs: ఫ్రెషర్లకు శుభవార్త.. ఆ ప్రముఖ సంస్థలో 3 వేల ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ మల్టీనేషనల్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్(Persistent Systems) ఫ్రెషర్స్(Freshers) కు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది భారీగా నియామకాలను(Freshers Hiring) చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
దేశీయ మల్టీనేషనల్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems ) సాంకేతిక రంగంలో నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. తమ కస్టమర్ల సంఖ్య అధికమవుతున్న కొద్దీ ఈ కంపెనీ నిరుద్యోగులను ముఖ్యంగా ఫ్రెషర్లను (Freshers) నియమించుకొనేందుకు సిద్ధమైంది.ఈ మేరకు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభాలను ప్రకటిస్తూ ఫ్రెషర్లకు తీపి కబురు అందించింది. తమ సేవలకు డిమాండ్ పెరిగినందున సంవత్సర కాలంలో 3,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు(Fresher Jobs) పెర్సిస్టెంట్ సిస్టమ్స్(Persistent Systems)  ప్రకటించింది. పూణే(Pune)కు చెందిన ఈ సంస్థ అనుభవజ్ఞులైన నిపుణులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతామని గతంలో ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఫ్రెషర్లను కూడా నియమించుకోనున్నట్లు స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని లాభంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 58.6 శాతం పెరిగిందని పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తాజా నివేదికలో పేర్కొంది. గత ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.101.98 కోట్ల నికర లాభం సంపాదిస్తే.. ఈ ఏడాది రూ.161.75 కోట్లు ఆర్జించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 34 శాతం పెరిగి రూ.1,007.74 కోట్ల నుంచి రూ.1,351.25 కోట్లకు చేరుకుంది. పెర్సిస్టెంట్ ఆశించినట్టుగా నిర్వహణ లాభాల మార్జిన్ 16.1 శాతంగా ఉందని అధికారులు వివరించారు.

క్లయింట్లు తమ వ్యాపారాలలో మార్పులను తీసుకురావాలనే బలంగా కోరుకుంటున్నందున డీల్స్ త్వరగా సెటిల్ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. కంపెనీ 100 మిలియన్ డాలర్ల వరకు అధిక డీల్ విలువలకు కూడా బిడ్డింగ్ చేస్తోందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం కాంట్రాక్ట్ విలువ ప్రకారం పెర్సిస్టెంట్ మొత్తం డీల్స్ ఆర్డర్స్ బుక్ $282.5 మిలియన్లుగా నమోదైంది.
Jobs in India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా తర్వాత జోరుగా సాగుతున్న నియామకాలు.. ఈ రంగాల్లో అత్యధికం

రెండో త్రైమాసికంలో 58.6 శాతం పెరిగిన లాభాలు..
మరోవైపు, పెర్సిస్టెంట్ కంపెనీలో అట్రిషన్ రేటు రెండో త్రైమాసికంలో 23.6 శాతానికి పెరిగింది.ఇది మునుపటి త్రైమాసికంలో 16.6 శాతంగా ఉంది. కిందటి ఏడాది కాలంలో ఇది 10.6 శాతంగా మాత్రమే ఉంది. అన్ని టెక్నాలజీ కంపెనీల్లో అనుభవజ్ఞులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా అట్రిషన్ రేటు ఈ స్థాయిలో నమోదవుతుందని తెలుస్తోంది. పెరుగుతున్న అట్రిషన్ రేట్స్ కారణంగా పలు కంపెనీలు టాలెంటెడ్ ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలను విపరీతంగా పెంచేస్తున్నాయి.
UPSC Civils Exam: సివిల్స్ రాయాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

పెర్సిస్టెంట్ కంపెనీ కూడా తమ ఉద్యోగుల వలసల ప్రభావాన్ని తగ్గించేందుకు ఫ్రెషర్లను నియమించుకోవడం, స్టాక్ ఆప్షన్స్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం, 15,800 మంది ఉద్యోగులలో 80 శాతం మందికి సహాయపడటం వంటి చర్యలను చేపడుతోంది. ప్రధానంగా టాలెంటెడ్ ఫ్రెషర్లను ప్రోత్సహించేందుకు ఓ ఏడాది కాలంలో 2,500-3,000 మధ్య ఫ్రెషర్లను నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published: