YouTube: భారత కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత యూట్యూబ్ షార్ట్ వీడియోలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఆ వీడియోలకు ఫుల్ క్రేజ్ వస్తోంది. సహజంగానే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బు అందించే యూట్యూబ్ ఇప్పుడు ఈ షార్ట్ వీడియోల కోసం స్పెషల్ ఫండ్ కేటాయించింది. యూట్యూబర్స్ కు మరింత ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈప్రోత్సాహకాలను అందించడం కోసం యూట్యూబ్ సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. అంటే సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుండగా.. 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల క్రియేటర్లకు ఈ ఫండ్ అందించనుంది. అయితే, ప్రతిదానికి ఏదో ఒకటి మెలిక పెట్టే యూట్యూబ్ ఇప్పుడు ఈ ప్రోత్సాహకాల విషయంలో కూడా షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందిస్తామని కండిషన్ పెట్టింది. ఇందుకోసం ముందుగా షార్ట్ వీడియోలు అప్ లోడ్ చేసే క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ ప్రత్యేకంగా నమోదు చేయాలని కోరింది.
ముందుగా క్రియేటర్లు ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. అలా యూట్యూబ్ ప్రకారం వ్యూస్ విషయంలో క్వాలిఫై అవాల్సి ఉంటుంది. అలా అయినవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇక ఈ ఫండ్ ను భారత్‌తో పాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాల క్రియేటరులకు అందించనుండగా త్వరలోనే మిగతా దేశాలలో కూడా మొదలుపెట్టేందుకు కృషిచేయనున్నట్లు తెలిపింది.
మరోవైపు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేలా మరో కొత్త ఫీచర్‌ను కూడా గతంలోనూ తీసుకొచ్చింది. 'సూపర్ థ్యాంక్స్' అనే ఈ ఫీచర్‌ను ఉపయోగించి యూట్యూబర్లు మరింత డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించింది. ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ అప్‌డేట్‌ను సంస్థ ప్రారంభించింది.
ఇప్పటికే షార్డ్ వీడియో యాప్ టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫాంలు వీడియో కంటెంట్ క్రియేటర్ల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ కొత్త అప్‌డేట్లు, ఫీచర్లపై దృష్టి పెట్టింది. యూట్యూబర్లు వారి వీక్షకుల నుంచి డబ్బు సంపాదించే మార్గాల్లో సూపర్ థ్యాంక్స్ ఫీచర్ నాలుగోది అవుతుంది. అభిమానులు కృతజ్ఞత భావాన్ని తెలియజేయడానికి.. తమ అభిమాన యూట్యూబ్ ఛానెల్స్‌కు ఆర్థిక సాయం అందించడానికి సూపర్ థ్యాంక్స్ ఫీచర్‌ను ఫాలోవర్లు కొనుగోలు చేయవచ్చు. దీని విలువ 2 నుంచి 50 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్ల ఆదాయ మార్గాలు పెరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Technology, Youtube, Youtube channel, Youtube stars