సచివాలయ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారికి గుడ్ న్యూస్...

Grama Sachivalayam | ఒక అభ్యర్థి నాలుగైదు విభాగాలకు పరీక్ష రాసి.. అన్నింటిలోనూ క్వాలిఫై అయితే, వారిని స్థానిక ప్రాధాన్యతలను బట్టి ఏ ఉద్యోగానికి తీసుకోవాలో నిర్ణయిస్తారు.

news18-telugu
Updated: September 22, 2019, 2:28 PM IST
సచివాలయ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారికి గుడ్ న్యూస్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 1 నుంచి 8 వరకు నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 27న ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా, సెప్టెంబర్ 27న అర్హత సాధించిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏపీ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని వెల్లడించారు. అర్హత సాధించిన వారి పూర్తి వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపామని, త్వరలోనే కాల్ లెటర్స్ కూడా పంపుతామని విజయ్ కుమార్ చెప్పారు. మొదట ఓపెన్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనున్నారు.. ఆ తర్వాత రిజర్వ్‌డ్ కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తారు.

అపాయింట్‌మెంట్ లెటర్స్ రావడానికి ముందు పాసైన అభ్యర్థులకు కాల్ లెటర్స్ వస్తాయి. ప్రభుత్వం కోరిన సర్టిఫికెట్లను (పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలనే మెసేజ్ కూడా వెళ్తుంది. దీంతోపాటు అభ్యర్థి పొందుపరిచిన ఈమెయిల్‌కు కూడా సమాచారం పంపుతారు. బీసీలు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.

ఒక అభ్యర్థి నాలుగైదు విభాగాలకు పరీక్ష రాసి.. అన్నింటిలోనూ క్వాలిఫై అయితే, వారిని స్థానిక ప్రాధాన్యతలను బట్టి ఏ ఉద్యోగానికి తీసుకోవాలో నిర్ణయిస్తారు. ఆ అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా వారు అడిగిన ప్లేస్ కేటాయిస్తారు. అభ్యర్థి సొంత మండలం కాకుండా పొరుగు మండలాల్లో పోస్టింగ్‌ ఇస్తారు. మొత్తం పోస్టులు 1.29లక్షలు కాగా, అర్హత సాధించిన వారు 1.96లక్షల వరకు ఉన్నారు. వీరిలో ఒకే వ్యక్తి నాలుగైదు విభాగాల్లో అర్హత సాధించిన వారు ఉంటారు కాబట్టి, మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేస్తారు.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading