Home /News /jobs /

GOOD NEWS NOW STUDENTS CAN APPLY FOR GRE AND TOEFL WITH AADHAAR CARD ID PROOF SS GH

Aadhaar Card: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఆధార్ కార్డుతో జీఆర్​ఈ, టోఫెల్​కు దరఖాస్తు చేసుకోవచ్చు

Aadhaar Card: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఆధార్ కార్డుతో జీఆర్​ఈ, టోఫెల్​కు దరఖాస్తు చేసుకోవచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఆధార్ కార్డుతో జీఆర్​ఈ, టోఫెల్​కు దరఖాస్తు చేసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card | విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇక ఆధార్ కార్డుతో జీఆర్​ఈ, టోఫెల్​కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్-ETS..

విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులు ప్రధానంగా జీఆర్​ఈ, టోఫెల్​, ఐఈఎల్​టీఎస్​ వంటి పరీక్షల్లో మంచి స్కోర్​ సాధించాల్సి ఉంటుంది. ఈ స్కోర్​ను బట్టే విద్యార్థి ఇంగ్లిష్​ నైపుణ్యాలను అంచనా వేస్తుంటాయి ఆయా యూనివర్సిటీలు. విద్యార్థుల అకడమిక్​ రికార్డ్​, జీఆర్​ఈ, టోఫెల్​ స్కోర్లను బట్టి అడ్మిషన్​ ఇస్తుంటాయి. అయితే, గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్స్ (జిఆర్ఈ), ఇంగ్లీష్ టెస్ట్ ఫర్ ఫారిన్ లాంగ్వేజ్(టోఫెల్) వంటి పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఇప్పటివరకు పాస్​పోర్ట్​ వంటి ఇంటర్నేషనల్​ ధృవీకరణ పత్రాలను మాత్రమే సబ్​మిట్​ చేయాల్సి ఉండేది. అయితే, ఇప్పుడు ఆధార్​ కార్డును కూడా విద్యార్థులు ఐడెంటిటీ ప్రూఫ్ కింద చూపించే అవకాశాన్ని కల్పించింది ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటిఎస్)​. తద్వారా ఇకపై ఆధార్ కార్డు సహాయంతో జీఆర్​ఈ, టోఫెల్​ వంటి ఇంటర్నేషనల్​ ఎగ్జామ్స్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.

NEET 2021: నీట్ పరీక్షలో 600 పైగా మార్కులు సాధించండి ఇలా

Assam Rifles Jobs 2021: అస్సాం రైఫిల్స్‌లో 131 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఈ కొత్త విధానం 2021 జూలై 1 అమల్లోకి వస్తుందని ఈటీఎస్​ పేర్కొంది. కాగా, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఈటిఎస్ స్పష్టం చేసింది. కోవిడ్​–19 లాక్‌డౌన్​ కారణంగా చాలా మంది విద్యార్థులు పాస్‌పోర్టులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సౌకర్యార్థం ఆధార్​ కార్డుతో జీఆర్​ఈ, టోఫెల్​ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. కాగా, జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటిఎస్) నిర్వహిస్తుంది.

BSF Recruitment 2021: బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Bank of Baroda Jobs 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

కరోనా నేపథ్యంలో వెలుసుబాటు...


కాగా, ఇది తాత్కాలిక వెలుసుబాటు మాత్రమేనని ETS పేర్కొంది. ఇది జూలై 1 నుండి అమల్లోకి వస్తుందని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈటీఎస్​ పేర్కొన్న వివరాల ప్రకారం, ఆగస్టు 21 నుండి నిర్వహించే టోఫెల్ ఎస్సెన్షియల్స్ టెస్ట్‌కు, అలాగే అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే జిఆర్‌ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ఇప్పటి వరకు విదేశీ విద్య కోసం పరీక్షలు రాసే భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా పాస్​పోర్ట్​ చూపించాల్సి ఉండేది. ఇప్పుడు పాస్​పోర్ట్​ లేకున్నా సరే కేవలం ఆధార్​ కార్డుతో జీఆర్​ఈ, టోఫెల్​కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. తద్వారా, ఎంతోమంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar, Aadhaar card, AADHAR, EDUCATION, UIDAI

తదుపరి వార్తలు