కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త...స్టెనోగ్రాఫర్లకు ప్రత్యేక ఇంక్రిమెంట్

(ప్రతీకాత్మక చిత్రం)

సబార్డినేట్ కార్యాలయాల స్టెనోగ్రాఫర్లకు కొత్త నిబంధనలు తెచ్చింది. తాజా ఉత్తర్వుల్లో స్టెనోగ్రాఫర్లు ఎవరైతే 100/120 w.p.m.వద్ద పరీక్షను క్వాలిఫై అయ్యారో వారు ఇంక్రిమెంట్ పొందవచ్చని తెలిపింది.

 • Share this:
  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. అడ్వాన్స్ ఇంక్రిమెంట్ లను నియంత్రించడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది. సబార్డినేట్ కార్యాలయాల స్టెనోగ్రాఫర్లకు కొత్త నిబంధనలు తెచ్చింది. తాజా ఉత్తర్వుల్లో స్టెనోగ్రాఫర్లు ఎవరైతే 100/120 w.p.m.వద్ద పరీక్షను క్వాలిఫై అయ్యారో వారు ఇంక్రిమెంట్ పొందవచ్చని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం, 80 w.p.m.స్పీడ్ టెస్ట్ ఆధారంగా ఎవరు నియమితులయ్యారో, వారు, తమ షార్ట్ హ్యాండ్ వేగాన్ని 120 w.p.m.పెంచుకొని పరీక్ష క్వాలిఫై అయితే సదరు ఉద్యోగికి రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ఇవ్వవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో తెలిపింది.

  స్పీడ్ టెస్ట్ ఆధారంగా 100 w.p.m వద్ద నియమితుడైన స్టెనోగ్రాఫర్, 120 w.p.m వద్ద షార్ట్ హ్యాండ్ క్వాలిఫై అయితే అతడు ఒక అడ్వాన్స్ ఇంక్రిమెంట్ పొందే వీలుంది. జూన్ 1, 2016 నుండి కొత్త ఇంక్రిమెంట్ నిబంధనలు వర్తిస్తాయని పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ (డిఓపిటి) యొక్క ఆఫీస్ మెమోరాండం (ఓఎం) తెలిపింది.

  2020 జూలై 24 నాటి డిపార్ట్‌మెంటల్ అథారిటీలతో ఏర్పాటు చేసిన అధికారులు స్పీడ్ టెస్టులు నిర్వహిస్తారని చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తేదీ నుండి ముందస్తు ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది. ఈ ఇంక్రిమెంట్ భవిష్యత్ ఇంక్రిమెంట్లలో గ్రహించబడదు. అలాగే, ఈ అడ్వాన్స్ ఇంక్రిమెంట్ మంజూరు చేసిన తరువాత వచ్చే ఇంక్రిమెంట్ తేదీ అలాగే ఉంటుంది.

  అడ్వాన్స్ ఇంక్రిమెంట్ మొత్తాన్ని బేసిక్ వేతనంతో పాటు ప్రత్యేక మొత్తంగా పరిగణిస్తారు. ఇది అన్ని ప్రయోజనాల కోసం చెల్లింపుగా లెక్కించబడుతుంది, DoPT తెలిపింది.
  Published by:Krishna Adithya
  First published: