హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Peddapalli: ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.., ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి.. వివరాలివే..!

Peddapalli: ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.., ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి.. వివరాలివే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రస్తుతం సాంప్రదాయ కోర్సుల కంటే టెక్నికల్ కోర్సులకే అధిక ప్రాధాన్యత ఉంది. మేనేజ్‌మెంట్ (Management), ఇంజనీరింగ్ (Engineering) వంటి కోర్సులు చేసిన వారికి సులభంగా ఉద్యోగాలు దొరికేవి. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా మల్టీ నేషనల్ కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Peddapalle, India

  E. Santosh, News18, Peddapalli

  ప్రస్తుతం సాంప్రదాయ కోర్సుల కంటే టెక్నికల్ కోర్సులకే అధిక ప్రాధాన్యత ఉంది. మేనేజ్‌మెంట్ (Management), ఇంజనీరింగ్ (Engineering) వంటి కోర్సులు చేసిన వారికి సులభంగా ఉద్యోగాలు దొరికేవి. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా మల్టీ నేషనల్ కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఐతే ఐటీఐ వంటి సాంప్రదాయ కోర్సులు చదివే వారికి మాత్రం ఉద్యోగాలు కల్లనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఐటీఐ చదివే వారిని పట్టించుకునే కంపెనీలు చాలా తక్కువ. ఒకవేళ ఉద్యోగాల్లోకి తీసుకున్నా.. కష్టమైన పని.. తక్కువ జీతం ఇచ్చి సరిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు.. ఐటీఐ చదివిన వారికి మెరుగైన ఉపాధినిచ్చేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.

  పెద్దపల్లి జిల్లాలో ఐటీఐ చదివిన విద్యార్థులకు శుభవార్త. పెద్దపల్లి పట్టణంలో 21న ఐటీఐ అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నారు. స్కిల్ ఇండియా, నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీం ఆధ్వర్యంలో ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటీస్‌షిప్ సౌకర్యం మేళా ఏర్పాటు చేశారు. 10వ తరగతి పాసై ఐటిఐ చదివిన వారికి ఇదొక సువర్ణ అవకాశమని ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ అప్రెంటీస్ పోస్టుల గురించి తెలుసుకొని అప్లైచేసుకోవాలని పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ నరసింహాచారి సూచించారు.

  ఇది చదవండి: IIITDMలో ఘనంగా నాలుగో స్నాతకోత్సవ వేడుకలు..టాపర్స్‌కు గోల్డ్‌మెడల్స్‌తో సత్కారం..!

  అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21న ఉదయం 10.30 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ ఆవరణలో నిర్వహించే అప్రెంటీస్‌షిప్ మేళాలో పాల్గొనాలని ప్రిన్సిపాల్ నరసింహాచారి పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు సమర్పించి, ధ్రువీకరణ పత్రాలతో హాజరవ్వాలని సూచించారు. ఐటీఐలో ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్ , మెకానిక్ మోటార్ వెహికిల్ ట్రేడ్ ఎదైన పూర్తయి ఐటీఐ పాస్ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. వయోపరిమితి: 18 నుండి 24 సంవత్సరాలు. అర్హత, ఆసక్తి వున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకొని అప్రెంటిస్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

  ఉన్నత చదువులు చదవలేని యువతకు స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో పరిశ్రమ ఆధారిత శిక్షణ కల్పించి వారికి స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా పరిశ్రమల్లో అవసరం ఉన్న ఖాళీలు, సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి, మెళుకువలు నేర్పించి వారిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. తద్వారా వారు పరిశ్రమలోకి అడుగుపెట్టడంతోనే పనిలో రాణిస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Iti jobs, Local News, Peddapalli, Telangana

  ఉత్తమ కథలు