GOOD NEWS FOR WOMEN ALONG WITH TRAINING JOBS IN L AND T COMPANY DETAILS HERE GH VB
Jobs For Womens: మహిళలకు గుడ్ న్యూస్.. శిక్షణతో పాటు ఆ సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Jobs For Womens: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ లార్సెన్ & టుబ్రో (L&T) సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కెరీర్ గ్యాప్ ఉన్న మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు ‘రెన్యూ కెరీర్ రీ-ఎంట్రీ ఫర్ ఉమెన్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ లార్సెన్ & టుబ్రో (L&T) సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కెరీర్ గ్యాప్ ఉన్న మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు ‘రెన్యూ కెరీర్ రీ-ఎంట్రీ ఫర్ ఉమెన్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌పై ఎల్ అండ్ టీ ట్వీట్ చేస్తూ ‘‘అందరికీ సమానమైన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ఓ కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నాం. చాలా మంది మహిళలు వివాహం తర్వాత ఉద్యోగాలు మానేస్తుంటారు. అటువంటి వారు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ఈ ‘కెరీర్ రీఎంట్రీ ఫర్ ఉమెన్’ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఈ కోర్సు ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్‌పై వారికి అవగాహన కల్పిస్తాం. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాం. ఆ తర్వాత మా సంస్థలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తాం” అని వెల్లడించింది.
స్క్రీనింగ్..
అప్లోడ్ చేసిన రెజ్యూమ్‌లను ముందుగా ఇంటర్నల్ స్క్రీనింగ్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎల్ అండ్ టీ సంస్థలోని సంబంధిత విభాగాలకు రెజ్యూమేలను షేర్ చేస్తారు.
టెలిఫోనిక్ ఇంటర్వ్యూ..
అభ్యర్థుల ప్రొఫైల్, ఖాళీలను బట్టి టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ..
టెలిఫోనిక్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన అభ్యర్థులకు సంబంధిత హైరింగ్ మేనేజర్ & డిపార్ట్మెంట్ హెడ్‌తో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రౌండ్ క్లియర్ చేసిన వారి సర్టిఫికెట్లను వెరిఫై చేసి నియామక పత్రం అందజేస్తారు.
లార్సెన్ & టూబ్రో (L&T) నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతోంది. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.