ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. ఇప్పటికే 14వేల ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ పోస్టులను భర్తీ చేసేందుకు మార్చి చివరలో రాత పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం ఏపీపీఎస్పీకి అప్పగించారు. ప్రశ్నపత్రం రూపొందించడం దగ్గరి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు ఏపీపీఎస్సీ చూసుకుంటుంది. ఈ పరీక్షను ఒకేసారి కాకుండా మూడు నాలుగు రోజుల పాటు నిర్వహించి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఫలితాల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)కి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇదిలావుంటే.. గ్రామ, వార్డు సచివాలయల పోస్టులను గతంలో భర్తీ చేశారు. కానీ మరో 14,061 పోస్టులు మిగలడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేటగిరీ-1లోని పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-5), వార్డు పాలన కార్యదరశి, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, సంక్షేమ విద్య సహాయకుల పోస్టులకు 4.56 దరఖాస్తులు రావడం గమనార్హం.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలకు సిలబస్ ఇదే
Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలు... జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, JOBS, Village secretariat, Village Secretariat Exams