IT Recruitment 2021 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఐటీలో భారీగా ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

IT Recruitment : ఐటీ రంగంలో ఉపాధి అవ‌కాశాల‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. అన్ని సాఫ్ట్‌వేర్‌ (Software) కంపెనీలు క‌రోనా త‌రువాత భారీగా నియామ‌కాలు చేప‌డుతున్నాయి. కొన్న సంస్థ‌లు ఉచిత కోచింగ్‌లను ఇచ్చి అవ‌స‌ర‌మైన వారిని ఎంచుకొనంటున్నాయి. ప్ర‌ముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్‌ (Tcs), విప్రో, ఇన్ఫోసిస్ (Infosys) ఇప్ప‌టికే నియామ‌కాలు ప్రారంభించ‌గా మిగిలిన కంపెనీలు అదే బాట ప‌డుతున్నాయి.

 • Share this:
  ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉండే బెంగళూరు, హైదరాబాద్‌, పుణే వంటి నగరాల్లో నియామక ప్రక్రియలో రెండంకెల వృద్ధి కనిపిస్తోంది. అంతే కాకుండా ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల్లో నిపుణుల (ప్రొఫెషనల్స్) అవసరాలు బాగా పెరిగిపోయాయి. ఈ కారణంగా డిమాండ్‌-సరఫరా బ్యాలెన్స్‌ కూడా దెబ్బతింటోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు చేజారిపోకుండా చూడటంపై దృష్టి సారిస్తున్నాయి. దీంతో ప్రీ-కొవిడ్‌ స్థాయితో పోల్చితే ఐటీ రంగంలో నిపుణులైన ఉద్యోగుల నియామకాల్లో 52 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అంతే కాదు జూన్‌ 2021 నాటి గణాంకాలను గతేడాది లెక్కలతో పోల్చితే 163 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను క్వెస్‌ అనే సంస్థ క్రోడికరించింది. ప్ర‌ముఖ ఐటీ కంపెనీలు.. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, కంపెనీలు కొత్త వారిని తీసుకొంటున్నాయి. వాటి వివ‌రాలు తెలుసుకోండి.

  భారీగా పెరిగిన జీతాలు..
  సంస్థలు ఉద్యోగుల్ని నియమించడమే కాదు. గతేడాదితో పాలిస్తే ఇప్పుడు భారీ ఎత్తున జీతాలు ఇస్తున్నాయి. ఉద్యోగులు ఎక్కువ జీతాలు ఆశించడమే కాదు.. అదే స్థాయిలో కంపెనీలు శాలరీలు ఇచ్చేందుకు వెనకడుగు వేయడంలేదు. పుల్‌ స్టాక్ ఇంజనీర్లకు కంపెనీలు 70-120 శాతం వరకు జీతాలు పెంచుతున్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక మిగిలిన రంగాలకు చెందిన ఉద్యోగుల జీతాల పెంపు 20-30 శాతంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఐటీలో చేరేవారికి ఇది మంచి ప‌రిణామ‌ని నిపుణులు చెబుతున్నారు.

  Postal Recruitment 2021 : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌త‌లో 221 పోస్ట‌ల్ ఉద్యోగాలు.. జీతం రూ.50,000 పైనే


  విప్రోలో 30,000 ఫ్రెషర్ జాబ్స్..
  ఫ్రెషర్స్‌ని నియమించేందుకు ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Wipro Elite National Talent Hunt) నిర్వహిస్తోంది. ఫ్రెషర్స్ కోసం విప్రో నిర్వహిస్తున్న హైరింగ్ ప్రోగ్రామ్ ఇది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ (B Tech Jobs) చదువుతున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అంటే 2022 సంవత్సరంలో బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 30,000 మంది ఫ్రెషర్స్‌కి ఆఫర్ లెటర్స్ (Fresher Jobs) ఇవ్వనుంది విప్రో. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. మొత్తం 30,000 ఆఫర్ లెటర్స్ ఇస్తే వీరిలో 22,000 మంది ఫ్రెషర్స్ ఉద్యోగాల్లో చేరతారని విప్రో భావిస్తోంది.

  మ‌హిళ‌ల కోసం టీసీఎస్ అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్..
  దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) మహిళా నిపుణుల కోసం ప్రత్యేక రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది. కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ పేరును రీ బిగిన్(Rebegin)గా నిర్ణయించారు.

  Prasara Bharati Recruitment : ఇంట‌ర్మీడియ‌ల్ అర్హ‌త‌తో ప్ర‌సార భార‌తిలో కాస్ట్ ట్రైనీ ఉద్యోగాలు..


  అర్హతలు.. దరఖాస్తు విధానం
  Step 1 : అభ్యర్థి రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య పని అనుభం ఉండాలి.
  Step 2 : గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి.
  Step 3 : ఆసక్తి గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక పోర్టల్ tcs.com లో TCS కెరీర్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  Step 4 : అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి
  Step 5 :అనంతరం అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించండి
  Step 6 : రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పైన చెప్పిన స్కిల్స్ ఆధారంగా తమ వివరాలను అందించాలి.
  Step 7 : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ వివరాలు పంపబడతాయి.
  Step 8 : ఎంపిక విధానం ఒకే రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నారు.

  టీసీఎస్ ఐఓన్ 15 రోజుల ఉచిత కోర్సు..
  ఊత‌మిచ్చేలా ఉచిత కోర్సుల‌ను అందించ‌నుంది. ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు ద్వారా ప‌దిహేను రోజుల‌ (Fifteen Days)పాటు కెరీర్ సంబంధిత కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. ఈ కోర్సు యువ‌త‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని సంస్థ పేర్కొంది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు క‌నీసం 7 నుంచి 10 గంట‌ల కోర్సు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం గ్రామీణ‌ విద్యార్థులు ఇబ్బంది ప‌డుతున్న ఇంగ్లీష్‌ (English)పై ప్ర‌త్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్ (Online) రూపంలో కోర్సు అందిస్తున్నారు.

  ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..
  Step 1: ఇది కేవ‌లం ఆన్‌లైన్ (online) ద్వారా మాత్ర‌మే అప్లె చేసుకోవాలి.
  Step 2 : కోర్సుకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ https://learning.tcsionhub.in/courses/career-edge-young-professional/ ను సంద‌ర్శించాలి.
  Step 3: అక్క‌డ మీకు కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
  Step 4: ప్రతీ కోర్సు స్ట్ర‌క్చ‌ర్‌ను చూసుకొని ఎంచుకోవాలి.

  SSC Recruitment 2021: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 3,261 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల


  ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ‌ అవ‌కాశాలు..
  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) దేశవ్యాప్తంగా వివిధ జాబ్ ప్రొఫైల్స్ కోసం ఆన్ లైన్ అప్లికేషన్లను స్వీకరిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ RPA డెవలపర్/కన్సల్టెంట్, ప్రిన్సిపాల్ ఆర్కిటెక్ట్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్-జావా మైక్రో సర్వీసెస్‌తో సహా అనేక జాబ్ ప్రొఫైల్‌ల కోసం నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో మెజారిటీ (Megarity) ఉద్యోగాలు బెంగుళూరుకు చెందినవే ఉన్నాయి. ఇటీవలే ఇన్ఫోసిస్ పలు రిక్రూట్మెంట్ డ్రైవ్ (Recruitment Drive) ల ద్వారా భారతదేశంలో 19,230 గ్రాడ్యుయేట్లను నియమించింది. అంతే కాకుండా విదేశాల్లో 1,941 మంది కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకొంది.

  దరఖాస్తు చేసుకొనే విధానం..
  Step 1 :  కేవలం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
  Step 1 :  అనంతరం అధికారిక వెబ్ సైట్ https://www.infosys.com/careers/apply.html సందర్శించాలి.
  Step 1 :  అక్కడ కంట్రీ ఇండియాను ఎంచుకోవాలి.
  Step 1 :  అనంతరం అభ్యర్థి పోస్టును క్లిక్ చేసి అప్లే చేసుకోవాలి.
  Step 1 :  వర్డ్/ పీడీఎఫ్ ఫార్మెట్ లో రెజ్యూమ్ ను అప్లోడ్ చేయాలి.
  Step 1 :  దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థి వయసు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
  Published by:Sharath Chandra
  First published: