news18-telugu
Updated: November 27, 2020, 11:51 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలోని నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్(APSSDC) కార్పొరేషన్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్(SWAN) సంస్థలో నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సర్వీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నియామకాన్ని చేపట్టారు. డిప్లొమో, బీఈ, బీటెక్ చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2017-2020 మధ్యలో పై విద్యార్హతలను పొందిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 18-25 ఏళ్ల వయస్సు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, ఒడిషా, రాయిపూర్, రాజస్థాన్, ఢిల్లీ, విశాఖపట్నం, కోల్ కత్తా, గౌహతి తదితర ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు నవంబర్ 30 చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
పోస్టు: సర్వీస్ ఇంజనీర్
విద్యార్హత: డిప్లోమో/బీ.టెక్(ECE,EEE, Instrumental and Environmental)
జీతం: ట్రైనింగ్ సమయంలో 12,500& ట్రైనింగ్ అనంతరం-15,000(PF&ESI)
వయస్సు: 18-25
స్కిల్స్: Inst. Handling, Operation&Servicing
Registration-Direct Link
Published by:
Nikhil Kumar S
First published:
November 27, 2020, 11:48 AM IST