Home /News /jobs /

GOOD NEWS FOR THOSE WHO MISSED QUET EXAM NEW SCHEDULE RELEASED AS ALWAYS UMG GH

CUET UG: ఎగ్జామ్ మిస్ అయిన వారికి గుడ్ న్యూస్.. కొత్త షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి అంటే ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- యూజీ (CUET- UG) పరీక్షలు గతవారం జరిగాయి. అయితే కొన్ని కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో చాలా మంది అభ్యర్థులు పరీక్ష(EXAMS)లు రాయలేకపోయారు. దీంతో వారికోసం తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది ?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- యూజీ (CUET- UG) పరీక్షలు గతవారం జరిగాయి. అయితే కొన్ని కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలు రాయలేకపోయారు. దీంతో వారికోసం తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA). గతంలో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 24-28 తేదీల్లో సీయూఈటీ ఎగ్జామ్ జరగనుంది. అడ్మిట్‌ కార్డులను పరీక్షకు ముందు జారీ చేయనున్నారు.

సెకండ్ ఫేజ్ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 4 నుంచి 6 మధ్య పరీక్ష(Exam) నిర్వహించినప్పటికీ టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ కారణాలతో కొన్ని సెంటర్లలో ఎగ్జామ్ జరగలేదు. దీంతో ఆగస్టు 12 నుంచి 14 మధ్య పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ భావించింది. అయితే ఈ తేదీలపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, కొత్త షెడ్యూల్ ప్రకటించినట్లు ఎన్‌టీఏ పేర్కొంది.

సీయూసీటీ రెండో స్లాట్ ఆగస్టు 4న ప్రారంభమైంది. ఆగస్టు 5న మొదటి స్లాట్‌కు జరగాల్సిన పరీక్ష 20 పరీక్ష కేంద్రాల్లో, అలాగే రెండో స్లాట్‌కు జరగాల్సిన పరీక్ష 30 కేంద్రాల్లో నిలిచిపోయింది. ఆదివారం జరిగిన సీయూఈటీ పరీక్షకు దేశవ్యాప్తంగా 63,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం, శుక్రవారం జరిగిన రెండో స్లాట్‌ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు.

పరీక్షను సజావుగా నిర్వహించేలా ఎన్‌టీఏ విద్యార్థుల కోసం స్పెషల్ గ్రివెన్స్ రెడ్‌ర్సెల్ ఇమెయిల్ ఐడీని రూపొందించిందని, దీంతో దేశవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం సెషన్ పరీక్ష బాగా జరిగిందని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ‘సబ్జెక్ట్ కాంబినేషన్, లాంగ్వేజ్ ప్రిఫరెన్స్, ప్రశ్నపత్రానికి సంబంధించిన ఫిర్యాదులను అభ్యర్థులు వారి దరఖాస్తు నంబర్‌ ద్వారా ఇమెయిల్ చేయవచ్చు. అలాగే NTA వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను చెక్ చేయాలి.’ అని జగదీష్ కుమార్ సూచించారు.

ఇదీ చదవండి: Tallest Flag Pole: దేశంలోనే ఎత్తైన జెండా .. ఎక్కడో తెలుసా ! దీని ప్రత్యేకతలు చదివితే సెల్యూట్ చేస్తారు..!



తాజా షెడ్యూల్ ప్రకారం.. సీయూఈటీ పరీక్ష సజావుగా సాగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు యూజీసీ చైర్మన్ తెలిపారు. పరీక్ష సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా 276 సెంటర్లలో పరీక్ష రాయడానికి మొత్తంగా 63,404 మంది అభ్యర్థులు రిజిస్ట్రర్ చేసుకున్నారని ఆయన తెలిపారు.

కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కలుగుతున్న అసౌకర్యాలను తెలుసుకుని ఎన్‌టీఏ సమీక్ష నిర్వహించింది. కొన్ని కేంద్రాలు సూచించిన ప్రోటోకాల్‌ను అనుసరించడంలో విఫలమయ్యయని తెలింది. దీంతో నిబంధనలు పాటించని పరీక్షా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.



కాగా, సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET)ను ఈ ఏడాది నుంచి నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 53 సెంట్రల్ యూనివర్సిటీ‌లతో పాటు 12 స్టేట్ యూనివర్సిటీలు, 11 డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ యూనివర్సిటీలు సైతం సీయూటీఈ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్స్ చేపట్టనున్నాయి. దీంతో ఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
Published by:Mahesh
First published:

Tags: CUET 2022, Exams, JOBS, National Testing Agency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు