హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Good News For Students: 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న వారికి గుడ్ న్యూస్.. వీరి కోసం ప్రత్యేక స్కాలర్ షిప్..

Good News For Students: 6వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న వారికి గుడ్ న్యూస్.. వీరి కోసం ప్రత్యేక స్కాలర్ షిప్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం టాటా క్యాపిటల్, 2022-23 విద్యా సంవత్సరానికి పంఖ్ (Pankh) స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

భారతీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్‌కు(Tata Group) చెందిన ఫ్లాగ్‌షిప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Financial Services) విభాగం టాటా క్యాపిటల్(Tata Capital), 2022-23 విద్యా సంవత్సరానికి పంఖ్ (Pankh) స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను(Scholarship Programme) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పంఖ్ స్కాలర్‌షిప్ కోసం buddytostudy.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2022 అక్టోబర్ 31ని దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు. 6వ తరగతి నుండి అండర్ గ్రాడ్యుయేట్ (General And Professionals) డిగ్రీ ప్రోగ్రామ్‌ల(Degree Programmes) వరకు విద్యార్థులు తమ విద్యాపరమైన కలలను నెరవేర్చుకోవడానికి ఈ స్కాలర్ షిప్‌ల ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.

అర్హత ప్రమాణాలు

స్కాలర్‌షిప్‌ మంజూరుకు టాటా గ్రూప్ అర్హత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో కనీసం 60శాతం మార్కులు(Marks) రావాల్సి ఉంటుంది. ఈ తరువాత ఇంటర్వ్యూ(Interview) ఉంటుంది. ఇది టెలిఫోనిక్ పద్దతిలో ఉంటుంది. ఈ ఇంటర్వ్యూను క్లియర్ చేసిన విద్యార్థులు ఫైనల్ కమిటీ రౌండ్‌కు షార్ట్‌లిస్ట్ అవుతారు. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4 లక్షలకు మించకూడదు.

స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ ప్రకారం.. ఎంపికైన విద్యార్థులకు అకడమిక్ కోర్సు కోసం ఫీజులో 80 శాతం స్కాలర్‌షిప్ రూపంలో పొందుతారు. టాటా క్యాపిటల్ ఉద్యోగులు కూడా పంఖ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగమై ఉంటారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి టాటా క్యాపిటల్ ఉద్యోగులు మార్గదర్శకంగా పనిచేయనున్నారు.

IRCTC Tours:తిరుపతి నుంచి ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు... రూ.990 ధరకే లోకల్ టూర్

టాటా క్యాపిటల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సారథి మాట్లాడుతూ.. “మా పంఖ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ విద్యార్థులు వారి విద్యా లక్ష్యాలను కొనసాగించడానికి తోడ్పాటునందిస్తుంది. దేశవ్యాప్తంగా అర్హులైన విద్యార్థులను చేరుకోవడానికి, వారి కుటుంబాలకు ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడంలో సహాయం చేయడం కోసం ఎదురుచూస్తున్నాం. టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా 1500 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.’’ అని వెల్లడించారు.

మరోవైపు, మేఘనాథ్ దేశాయ్ అకాడమీ ఆఫ్ ఎకనామిక్స్ (MDAE) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఎకనామిక్స్, డేటా సైన్స్, ఫైనాన్స్‌లో మెరిట్ స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. పీజీ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్‌లో 12 స్కాలర్‌షిప్‌లు, డేటా సైన్స్ నుంచి అదనంగా మరో 4 స్కాలర్‌షిప్‌లను 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ meghnaddesaiacademy.org నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

Govt Jobs 2022: డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిని వారికి బెస్ట్ చాన్స్.. నెలకు రూ.18,000 వేతనంతో అప్రెంటీస్ జాబ్స్

ఈ స్కాలర్ షిప్‌లలో దాదాపు 90 శాతం వరకు మెరిట్ విద్యార్థుల కోసం కేటాయించినట్లు మేఘనాథ్ దేశాయ్ అకాడమీ తెలిపింది. మొదటగా ప్రవేశ పరీక్ష, అడ్మిషన్ల ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది పూర్తి చేసిన అభ్యర్థులు మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌ల మూల్యాంకనానికి అర్హత పొందవచ్చు. ఫైనల్‌గా స్కాలర్ షిప్‌ల మంజూరు‌కు ఇంటర్వ్యూ ఉంటుందని సదరు సంస్థ వెల్లడించింది.

First published:

Tags: Career and Courses, Students, Tata Group

ఉత్తమ కథలు