తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త తెచ్చింది. జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) ఉద్యోగాల బర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా డిసెంబర్ 16, 2022 నుంచి జనవరి 06, 2023 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పరీక్షను జూన్ లేదా జులై 2023లో నిర్వహించనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేస్తారు. 27 సబ్జెక్టుల్లో.. మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలిలా..
1. అరబిక్ - 02
2.బోటనీ - 113
3. బోటనీ (ఉర్దూ మీడియం)-15
4.కెమిస్ట్రీ - 113
5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) - 19
6. సివిక్స్ - 56
7.సివిక్స్ (ఉర్దూ మీడియం) - 16
8. సివిక్స్ (మారాఠీ) - 01
9. కామర్స్ - 50
10. కామర్స్ (ఉర్దూ మీడియం) - 07
11. ఎకనామిక్స్ - 81
12. ఎకనామిక్స్ (ఉర్దూ) - 15
13. ఇంగ్లీష్ - 81
14.ఫ్రెంచ్ - 02
15. హిందీ - 117
16. హిస్టరీ- 77
17. హిస్టరీ (ఉర్దూ మీడియం) - 17
18. హిస్టరీ (మరీఠీ మీడియం) - 01
19. మ్యాథ్స్ - 154
20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 09
21. ఫిజిక్స్ - 112
22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం) - 18
23. సాంస్క్రీట్(Sanskrit) - 10
24. తెలుగు - 60
25. ఉర్దూ - 28
26. జువాలజీ - 128
27. జువాలజీ (ఉర్దూ మీడియం) - 18
ఇదిలా ఉండగా.. గత మూడు రోజుల నుంచి టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. మొన్న పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించి 247 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. నిన్న 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇలా వరుస నోటిఫికేషన్లతో తెలంగాణలోని నిరుద్యోగుల్లో ఆనందకోలాహలం కనపడుతోంంది.
33 జిల్లాల వారీగా నిరుద్యోగ అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఏ జిల్లా లైబ్రరీలో చూసినా.. కిక్కిరిసిపోయే విధంగా అభ్యర్థులు చదువుకుంటున్నారు. ఎక్కడ చూసినా.. ఉద్యోగాల సందడే నెలకొంది. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే పరీక్షల తేదీల్లో సమయాన్ని ఎక్కువగా ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Teacher, Teacher jobs, TSPSC