ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) వివిధ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నేషనల్ స్కాలర్‌షిప్ అధికారిక వెబ్‌సైట్, scholarships.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31, 2022 గా నిర్ణయించారు. బాలికల కోసం ప్రగతి స్కాలర్‌షిప్, దివ్యాంగ విద్యార్థుల కోసం సాక్షం స్కాలర్ షిప్, అనాథ విద్యార్థుల కోసం స్వనాథ్ స్కాలర్‌షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయని ఏఐసీటీఈ తెలిపింది. ప్రెషర్స్, రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది.
స్వనాథ్ స్కాలర్‌షిప్- అర్హత ప్రమాణాలు
ఈ స్కాలర్ షిప్ పథకానికి దరఖాస్తు(Application) చేసుకోవాలంటే విద్యార్థులు అనాథలై ఉండాలి. వారి తల్లిదండ్రులు కరోనా కారణంగా మరణించి ఉండాలి. లేదా సాయుధ దళాలు, సెంట్రల్ పారామిలిటరీ బలగాల్లో పనిచేస్తూ వీర మరణం పొంది ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులకు స్వనాథ్ స్కాలర్‌షిప్ పథకం కింద ప్రతి సంవత్సరం విద్య కోసం రూ. 50,000 ఇవ్వనున్నారు.
ప్రగతి స్కాలర్‌షిప్
ఏఐసీటీఈ అమోదించిన టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో డిగ్రీ/డిప్లొమా కోసం అడ్మిషన్ పొందిన ప్రతిభావంతులైన అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం 10 వేల స్కాలర్ షిప్‌లు ప్రకటిస్తారు. ఒక్కో స్కాలర్‌షిప్‌కు ఏడాదికి రూ. 50,000 ఇవ్వనున్నారు.
సాక్షం స్కాలర్‌షిప్
AICTE ఆమోదించిన టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో డిగ్రీ/డిప్లొమా కోసం అడ్మిషన్ పొందిన దివ్యాంగ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ కింద రూ. 50,000 ఇవ్వనున్నారు.
విద్యార్థులు అప్లికేషన్లను సకాలంలో సమర్పించాలని ఏఐసీటీఈ సూచించింది. అక్టోబర్ 30 ఫస్ట్ లెవల్, నవంబర్ 15 సెకండ్ లెవల్ అప్లికేషన్ వెరిఫికేషన్ తుది గడువుగా ఏఐసీటీఈ నిర్ణయించింది. అప్లికేషన్ వెరిఫికేషన్స్‌ను ఇన్ స్టిట్యూట్స్, స్టేట్ నోడల్ అథారిటీ చేపట్టనున్నాయి.
మరోవైపు.. బిహార్(Bihar)లోని గోన్‌పురా గ్రామానికి చెందిన ఓ దళిత విద్యార్థి అమెరికాలోని పెన్సిల్వేనియాలోని ప్రతిష్ఠాత్మక కాలేజీలో చదువుకునేందుకు భారీ స్కాలర్‌షిప్ గెలుచుకున్నాడు. ప్రేమ్ కుమార్ తండ్రి ఓ రోజువారీ కూలీ. ఆర్థికంగా అతని కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ప్రేమ్ పెద్ద కలలుకన్నాడు. ప్రతిష్ఠాత్మక లేఫాయెట్ కాలేజీ (Lafayette College)లో మెకానికల్ ఇంజనీరింగ్, ఇంటర్నేషనల్ అఫైర్స్ చదవాలని ఆకాంక్షించాడు. అంతేకాదు, ఈ కాలేజీలో చదివేందుకు సరిపడా స్కాలర్‌షిప్‌ను డెక్స్టెరిటీ గ్లోబల్ గ్రూప్ సాయంతో గెలుపొంది అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. పాట్నాకు చెందిన 17 ఏళ్ల ప్రేమ్ కుమార్ యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేయడానికి రూ.2.5 కోట్లు స్కాలర్‌షిప్‌ను గెలుపొందడంతో అతని తల్లిదండ్రులను ఆనందంతో పొంగిపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicte, IT jobs, JOBS, Scholarships