Home /News /jobs /

GOOD NEWS FOR THE UNEMPLOYED A LEADING COMPANY THAT HAS BROUGHT JOB ALERTS IN MORE LANGUAGES UMG GH

Indeed In Hindi: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరిన్ని భాషల్లో జాబ్ అలర్ట్స్ ను తెచ్చిన ప్రముఖ కంపెనీ..!

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరిన్ని భాషల్లో జాబ్ అలర్ట్స్ ను తెచ్చిన ప్రముఖ కంపెనీ..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరిన్ని భాషల్లో జాబ్ అలర్ట్స్ ను తెచ్చిన ప్రముఖ కంపెనీ..!

భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీ (Hindi) భాషలో తమ జాబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది ఇండీడ్ (Indeed). ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఈ రోజుల్లో నిరుద్యోగులు (Unemployed People) ఉద్యోగాలు కోసం ఎక్కువగా ఆన్‌లైన్ జాబ్‌పోర్టల్స్‌ (Jobportals) పైనే ఆధారపడుతున్నారు. ఈ ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్స్‌ అందరికీ తగిన జాబ్స్ లిస్ట్‌ చేస్తూ ఉద్యోగార్ధులకు (Jobseekers) ఎంతగానో సహాయపడుతున్నాయి. అయితే ఇండియాలో ప్రాంతీయ భాషలలో జాబ్స్ వివరాలను అందించే జాబ్‌ సెర్చ్‌ వెబ్‌సైట్స్‌ తక్కువగానే ఉన్నాయి. దీంతో డ్రైవర్స్, ఫుడ్ డెలివరీ, ఇంకా తదితర జాబ్స్‌ వెతికే నిరుద్యోగులకు ఇంగ్లీష్ అర్థం కాక చాలా కష్టమైపోతోంది. ఈ వెబ్‌సైట్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తోన్న ఇండీడ్ (Indeed) ఈ సమస్యను గుర్తించింది. అందుకే తాజాగా భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీ (Hindi) భాషలో తమ జాబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా సోమవారం ప్రకటించింది.

ఈ అప్‌డేట్ ప్రస్తుతం మొబైల్(Mobile) వెబ్‌సైట్, మొబైల్ యాప్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్‌తో ఉద్యోగార్ధులందరూ తమ మొబైల్ ఫోన్‌ల నుంచి హిందీలో ఉద్యోగాలను కనుగొని, దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే హిందీలోనే ఈ వెబ్‌సైట్ వేదికగా రెజ్యూమ్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.

భారతదేశంలోని అనేక భాషలలో హిందీ(Hindi) ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 43.63 శాతానికి పైగా హిందీ మాట్లాడుతున్నారు. KPMG నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 125 మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ మూడు లక్షల కంటే తక్కువ మంది దీనిని తమ మొదటి భాషగా ఉపయోగిస్తున్నారు. ప్రజలు భారతదేశంలోని 22 అధికారిక ప్రాంతీయ భాషలలో తమ మాతృభాషను ఎక్కువగా ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో హిందీ కూడా ఒకటి. దేశంలో గత కొంతకాలంగా హిందీ వంటి ప్రాంతీయ భాషలలో కంటెంట్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని గమనించిన Indeed హిందీ భాషలోనే జాబ్ వివరాలను ఆఫర్ చేయడం ప్రారంభించింది. దీంతో ఇంగ్లీషు రాక పోయినా నిరుద్యోగులు హిందీ భాషలో అన్ని ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: Technical Bugs: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


ఈ కొత్త అప్‌డేట్‌లో యజమానికి (Employer) నేరుగా కాల్స్‌ చేయడం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగార్ధులు తమ ఆసక్తిని వ్యక్తపరచడానికి, ఉద్యోగం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి యజమానికి కాల్ చేయవచ్చు. అలానే కొత్తగా వచ్చిన ఆటో-ఫిల్‌ ద్వారా మీ అప్లికేషన్‌ యజమానులకు త్వరగా కనిపిస్తుంది. మీ జాబ్ అప్లికేషన్ త్వరగా కనిపించేలా చాట్‌బాట్లను కూడా ఆటో-ఫిల్‌ వేగవంతం చేస్తుంది.



అప్‌డేట్ లాంచ్‌ సందర్భంగా ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ మాట్లాడుతూ.. "ఈ రెండేళ్లలో భారతదేశంలో జాబ్స్‌ కోసం విజిట్ చేసే వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. అతిపెద్ద జాబ్ మార్కెట్‌లలో ఇండియా ఒకటి ఉంది. ఈ ట్రాఫిక్ పెరుగుదల భారతదేశంలోని ప్రజలు గతంలో కంటే ఆన్‌లైన్‌లో ఉద్యోగాలను కనుగొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని చెప్పకనే చెబుతోంది" అని చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Unemployment

తదుపరి వార్తలు