TS Police Jobs : గుడ్‌న్యూస్.. ఈసారి ఎక్కువమందికి పోలీస్ ఉద్యోగాలు వచ్చే అవకాశం

TS Police Jobs | దాదాపు 18 వేల పోస్టులకు.. ఆరు లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఫైనల్ ‌ఎగ్జామ్‌కి లక్షన్నరమందికిపైగా హాజరయ్యారు వీరంతా ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వందలాది అభ్యర్థులు కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై ఉద్యోగాలు కూడా రాశారు.

news18-telugu
Updated: May 18, 2019, 10:23 AM IST
TS Police Jobs : గుడ్‌న్యూస్.. ఈసారి ఎక్కువమందికి పోలీస్ ఉద్యోగాలు వచ్చే అవకాశం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 18, 2019, 10:23 AM IST
తెలంగాణ పోలీస్ నియామకప్రక్రియలో ఈసారి మార్పులు చేయనున్నారు అధికారులు ప్రాధాన్యక్రమంలో పోలీస్ రిజల్ట్స్ వెల్డించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో.. ఎక్కువమంది ఉద్యోగాలు పొందే అవకాశముంటుంది. జూన్ మొదటివారం కల్లా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 18 వేల పోస్టులకు.. ఆరు లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఫైనల్ ‌ఎగ్జామ్‌కి లక్షన్నరమందికిపైగా హాజరయ్యారు వీరంతా ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వందలాది అభ్యర్థులు కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై ఉద్యోగాలు కూడా రాశారు.

అయితే, ఉద్యోగానికి అప్లై చేసినవారిలో చాలామంది కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై ఎగ్జామ్స్ కూడా రాశారు. వీరిలో చాలామంది రెండు ఉద్యోగాలకు ఎంపిక అవుతుంటారు. ఎస్సైగా ఎంపికైనవారు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకుంటారు. వారు వదిలేసిన కానిస్టేబుల్ జాబ్ అలా ఖాళీగానే మిగులుతుంది. 2017లో ఇలానే.. 700 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ సంవత్సరం నుంచి అలా కాకుండా ప్రాధాన్యక్రమంలో ఫలితాలు వెల్లడించేందుకు నియామక మండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారణంగా ఎక్కువమంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత పొందే అవకాశముంది.

ఇవి కూడా చదవండి..

EAMCET Results 2019 : మే 27 తర్వాతే TS, AP EAMCET Results.. ఎందుకంటే..

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...