హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Last Date: ఉన్నత విద్యకు డబ్బులు లేవని భయపడుతున్నారా..? ఈ రోజే ఆఖరి రోజు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Last Date: ఉన్నత విద్యకు డబ్బులు లేవని భయపడుతున్నారా..? ఈ రోజే ఆఖరి రోజు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్

Last Date: పేదల ఉన్నత విద్యపై ఫోకస్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు సీఎం జగన్.. అందులో భాగంగా.. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సహాయం చేస్తున్నారు. అయితే దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరి రోజు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అర్హతలు ఏంటంటే?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Last Date: సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిలుస్తోంది. వరుసగా సంక్షేమ పథకాలు (Welfare Schemes) అందిస్తూనే ఉంది. ముఖ్యంగా వైద్యం.. విద్యా రెండు రంగాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు రంగాల్లో సమూల మార్పులకు ఎన్నో పథకాలను తీసుకోచ్చారు. ముఖ్యంగా పేదలను ఉన్నత విద్యావంతులుగా చేయడానికి అనుక్షణం ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన (Jagananna Videshi Vidya Deevena) పథకాన్ని అందిస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు..

  అన్ని అర్హతలు ఉండి ఎవరైనా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే త్వరపడండి. విద్యార్థులను అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం వరంగా మారింది.

  పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు సంబంధించి ఈ పథకంతో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరనుంది. చాదువ్లో మేటిగా రాణిస్తు.. విదేశీ విద్య అభ్యసించడానికి డబ్బులు లేవు అని ఇబ్బందులు పడే వారికి.. చేయూతనిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది.

  ఇదీ చదవండి : సరస్వతీ దేవికి పవన్ ప్రత్యేక పూజలు.. అక్టోబర్ నుంచి కీలక నిర్ణయాలు ఏంటంటే..?

  సాయం ఎంత..?                                                                                        క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో ప్రపంచంలో టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే క్యూస్‌ వరల్డ్‌ ర్యాకింగ్‌ ప్రకారం టాప్‌ 100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఆ తరువాత అంటే.. టాప్‌ 100 నుంచి 200 ర్యాకింగ్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు పొందిన వారికి 50 లక్షల వరకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తుంది. దీంతో విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

  ఇదీ చదవండి : అమ్మకు ప్రేమతో.. ఆమె కోరికపై మోడల్ గా మారిన మిడిల్ క్లాస్ యువతి.. సక్సెస్ స్టోరీ ఇదే

  అర్హతలు ఏంటంటే..?

  ఏడాదికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయనున్నారు. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్‌లో 60 శాతం మార్కులు, తత్సమాన గ్రేడ్‌ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్‌ కోర్సులకు నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ఈ ఆర్థికసాయం ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజురీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తారు.

  ఇదీ చదవండి : ఇంట్లో ఉంటూనే ఆదాయం.. ఆరోగ్యం కోసం ఇలా చేయండి

  నేడే ఆఖరు.. ఎలా దరఖాస్తు చేయాలి..?

  ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారో.. వారు కులం, ఆదాయ సర్టిఫికెట్లు, మార్కులిస్టు తదితర వివరాలతో ఇవాళ రాత్రి లోపు http:// jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఈ పథకం వర్తింపజేస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు