Home /News /jobs /

GOOD NEWS FOR STUDENTS TELANGANA GOVERNMENT TO SET UP 16 MEDICAL COLLEGES BY 2023 24 WITH 2400 MBBS SEATS SS

Medical Colleges: తెలంగాణలో 16 కొత్త మెడికల్ కాలేజీలు... 2,400 ఎంబీబీఎస్ సీట్లు...

Medical Colleges: తెలంగాణలో 16 కొత్త మెడికల్ కాలేజీలు... 2,400 ఎంబీబీఎస్ సీట్లు
(ప్రతీకాత్మక చిత్రం)

Medical Colleges: తెలంగాణలో 16 కొత్త మెడికల్ కాలేజీలు... 2,400 ఎంబీబీఎస్ సీట్లు (ప్రతీకాత్మక చిత్రం)

Medical Colleges | తెలంగాణలో మరో 16 మెడికల్ కాలేజీలు (Medical Colleges) ప్రారంభం కానున్నాయి. ఈ 16 కాలేజీల ద్వారా 2,400 ఎంబీబీఎస్ సీట్లు (MBBS Seats) అందుబాటులోకి వస్తాయి.

  వైద్య వృత్తి చేపట్టాలనుకునే తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో మరో 16 మెడికల్ కాలేజీలు (Medical Colleges) రాబోతున్నాయి. ఇందులో 8 వైద్య కళాశాలలు 2022-23 విద్యా సంవత్సరంలోనే ప్రారంభం కానున్నాయి. మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో వచ్చే ఏడాదే కొత్త వైద్య కళాశాలలు (New Mediacl Colleges) ప్రారంభం అవుతాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1200 సీట్లు 2022-23 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఇవి కాకుండా మరో 8 వైద్య కళాశాలల ద్వారా 2023-24 విద్యా సంవత్సరంలో మరో 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జాతీయ వైద్య కమిషన్‌కు సెప్టెంబర్ 23న దరఖాస్తు పంపనుంది. నవంబర్, డిసెంబర్‌లో నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు తనిఖీలకు వచ్చే అవకాశం ఉంది.

  Job Mela: మొత్తం 350 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా... టెన్త్ పాస్ అయితే చాలు

  2023-24 విద్యా సంవత్సరంలో వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి. మరో 4 వైద్య కళాశాలల్ని ఎక్కడ ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. 2023-24 విద్యా సంవత్సరం నాటికి మొత్తం 16 మెడికల్ కాలేజీల ద్వారా 2,400 సీట్లు అందుబాటులోకి వస్తాయి. వైద్య వృత్తి చేపట్టాలనుకునే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి.

  కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే అనుబంధంగా 330 పడకల ఆస్పత్రి ఉండాలి. దీంతో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రుల్లో బెడ్స్‌ని పెంచేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనుకుంటున్న ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను 330 కి పెంచే పనుల్ని వేగవంతం చేసింది ప్రభుత్వం. ఇందుకోసం భవనాలను కూడా నిర్మిస్తోంది.

  TCS NQT 2021: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ దరఖాస్తుల్ని ప్రారంభించిన టీసీఎస్

  ప్రస్తుతం తెలంగాణలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిద్దిపేట, నల్గొండ, సూర్యపేట, మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దీంతో వైద్య కళాశాల సంఖ్య 9 కి చేరుకుంది.

  ఒక్కో జిల్లాకు ఒక్కో మెడికల్ కాలేజీ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 ప్రభుత్వ కాలేజీల్లో 1,640 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రెండేళ్లలో 16 మెడికల్ కాలేజీల ద్వారా 2,400 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రెండేళ్ల తర్వాత తెలంగాణలో మొత్తం 4,040 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Medical college, Medical colleges, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు