Home /News /jobs /

GOOD NEWS FOR STUDENTS MITXPRO POST GRADUATE CERTIFICATE IN CYBERSECURITY PROGRAM NOW AVAILABLE FOR INDIAN STUDENTS KNOW HOW TO ENROL SS GH

Cyber Security Course: ఎంఐటీ యూనివర్సిటీ నుంచి సైబర్ సెక్యూరిటీలో పీజీ సర్టిఫికెట్ కోర్సు

Cyber Security Course: ఎంఐటీ యూనివర్సిటీ నుంచి సైబర్ సెక్యూరిటీలో పీజీ సర్టిఫికెట్ కోర్సు
(ప్రతీకాత్మక చిత్రం)

Cyber Security Course: ఎంఐటీ యూనివర్సిటీ నుంచి సైబర్ సెక్యూరిటీలో పీజీ సర్టిఫికెట్ కోర్సు (ప్రతీకాత్మక చిత్రం)

Cyber Security Course | విద్యార్థులకు శుభవార్త. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) అందిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ భారతీయ విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు. మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ ర్యాంక్​ పొందిన అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. సైబర్​ సెక్యూరిటీని (Cyber Security) కెరీర్​గా ఎంచుకునే వారి కోసం ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్​ను ఆవిష్కరించింది. ఈ ప్రోగ్రామ్​ కేవలం విదేశీయులకే కాకుండా భారతీయ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుంది.

విద్యార్థులతో పాటు ఎక్స్​పీరియన్స్​ ప్రొఫెషనల్స్​ కూడా ఈ కోర్సులో ఎన్​రోల్​ అవ్వొచ్చు. ఈ సైబర్‌ సెక్యూరిటీ మొత్తం 10 నెలల పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్సు. భారతదేశంలో ఎమెరిటస్ సహకారంతో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఈ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని MIT ఈ కోర్సును ఆవిష్కరించింది.

Bank Jobs: రూ.1,00,000 వరకు వేతనంతో 115 బ్యాంక్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

ఈ ఆన్​​లైన్​ ప్రోగ్రామ్ డిసెంబరు 30న ప్రారంభమవుతుంది. ఈ ప్రోగ్రామ్​ కోసం USD 3,500 (రూ.2,66,967) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ విధానంలో కూడా ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గలవారు డిసెంబర్ 29లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో భాగంగా లైవ్ వీక్లీ సెషన్లు, గ్లోబల్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ లీడర్లతో రికార్డ్ చేసిన లెక్చర్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్​లో భాగంగా లైవ్​ సెషన్లలో కూడిన క్లాసులుంటాయి. సైబర్‌ సెక్యూరిటీలో పనిచేస్తున్న మధ్య-స్థాయి, సీనియర్-స్థాయి నిపుణులకు సైతం ఈ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది.

SBI Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,226 జాబ్స్... ఏం చదవాలంటే

సైబర్​ సెక్యూరిటీ పెరుగుతున్న అవకాశాలు..


స్టేట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (ఐఎస్​ఏసీఏ), 2021 ప్రకారం, 32 శాతం భారతీయ సంస్థలు గతేడాది కంటే 2021లో ఎక్కువ సైబర్‌టాక్‌లను ఎదుర్కొన్నాయి. అందుకే అన్ని సంస్థలకు సైబర్​నిపుణుల అవసరం పెరిగింది. ఎంఐటీ ఓపెన్ లెర్నింగ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ శర్మ మాట్లాడుతూ, “ప్రస్తుత కాలంలో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్​కు డిమాండ్​ గణనీయంగా పెరిగింది. దాదాపు 10 సంస్థల్లో ఏడు సంస్థలు సైబర్‌ సెక్యూరిటీకీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందువల్ల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఈ రంగంలో రావాలనుకునే కొత్త వారితో పాటు, ఎక్స్​పీరియన్స్​డ్​ ప్రొఫెషన్స్​ కోసం ఎంఐటీ ఎక్స్​ప్రో సైబర్‌సెక్యూరిటీ ప్రోగ్రామ్​ను పరిచయం చేస్తోంది. సైబర్‌ సెక్యూరిటీలో లోతైన అవగాహన కొరకు ఈ ప్రోగ్రామ్​ను రూపొందించాం. ఈ ప్రోగ్రామ్‌ను భారతదేశానికి తీసుకురావడం ద్వారా ఇక్కడి విద్యార్థులను సైబర్​ సెక్యూరిటీ నిపుణులుగా తీర్చిదిద్దవచ్చు. ఎమెరిటస్‌ సహకారంతో ఎంఐటీ ఎక్స్​ప్రో ప్రోగ్రామ్​ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం” అని చెప్పారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Career and Courses, Online Education

తదుపరి వార్తలు